శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని
శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని
[దీనిని నిత్యము పఠించిన హనుమంతుని ప్రసన్నుని చేసికొన గలము]
శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః
విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః
దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః
స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః||
శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం
రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి
రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే
భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః ||
అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన
లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన
సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన
ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట
శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల్యాః
దాస్యం యస్యై త్వదూష్యం ప్రమద మతితరాం దాస్యతి ప్రాభవాద
ప్యానం దామంద కంద స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
త్యాగీ యేగీ విరాగీ పర హితకర ణానుక్ష ణానందభోగీ
త్రాతా నేతా విధాతా నిఖిల సురరిపు వ్రాత దుఃఖ ప్రదాతా
సారాచార ప్రకార స్సమర పరగ ణాజ్యయ వీరాధివీరః
కేళీ తూలీ కృతాద్రి స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
— శుభం భూయాత్ —-