సుభాషితం - (Subhashitam) స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి...
సుభాషితం - (Subhashitam)
స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి...
మత్యా పరీక్ష్య మేధావీ బుద్ధ్యా సంపాద్యచా సకృత్ |
శ్రుత్వా దృష్ట్వా ౭థవిజ్ఞాయ ప్రాంజ్ఞై ర్మైత్రీం సమాచరేత్ ||
తెలివైన వ్యక్తులు స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఆలోచించి మిత్రులను ఎంచుకోవాలి. బాగా ఆలోచించి, స్వయంగా పరిశీలించి, తర్కించి చూసుకుని, తోటివారితో చర్చించి, బుద్ధిమంతులు అని నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే మైత్రి కలుపుకోవాలి.