సుభాషితం - (Subhashitam) ఎవరితో ఎలా undaali....
సుభాషితం - (Subhashitam)
ఎవరితో ఎలా ఉండాలి ?!
దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ద్రుష్టతా
యే చైవం పురుషాః కలాసు కుశాలాంతేస్వేవ లోకస్థితిః
తమవారితో ప్రేమగా, అనుకూలంగా ఉండాలి. సేవకులపట్ల దయాగుణం చూపాలి. కుట్రలు పన్నే మోసగాళ్ళతో కపటంగానే వ్యవహరించాలి. మంచివారితో సన్నిహితంగా ఉండాలి. గురువులు పరుషంగా మాట్లాడినా పట్టించుకోకూడదు. పండితులను గౌరవించాలి. శత్రువుల దగ్గర పరాక్రమాన్ని చూపాలి. స్త్రీలతో సమర్ధంగా నడచుకోవాలి.