సుభాషితం - (Subhashitam) కట్టడితో మార్పు సాధ్యమా...
సుభాషితం - (Subhashitam)
కట్టడితో మార్పు సాధ్యమా...
అంభోజినీ వన విహార విలాసమేవ
హంసస్య హంతు నిరతాం కుపితో విధాతా
న త్వస్య దుగ్ధ జల భేదవిధౌ ప్రసిద్దాం
వైదగ్ధ కీర్తిం అపహర్తు మసౌ సమర్ధః
బ్రహ్మదేవుడికి తన వాహనమైన హంసరాజు మీద కోపం వస్తే, తామరవనంలో తిరగకుండా కట్టడి చేయగలడు. అంతే తప్ప పాలను, నీళ్ళను వేరు చేయగల హంస గొప్పతనాన్ని కానీ, దాని పేరు ప్రతిష్టలను గానీ పోగొట్టలేడు.