సుభాషితం - (Subhashitam) విద్యావంతులను రాజులు పూజిస్తారు....
సుభాషితం - (Subhashitam)
విద్యావంతులను రాజులు పూజిస్తారు....
విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః
విద్యాబంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసుపూజ్యతే నహి ధనంవిద్యావిహీనః పశుః
విద్య అమూల్యమైన సొమ్ము. అది రూపాన్నే మారుస్తుంది. సౌఖ్యాలను సమకూరుస్తుంది. కీర్తిని తెచ్చిపెడుతుంది. విద్య ఆప్త బంధువు, గురువు, దైవం. లోకంలో చదువుకు సాటివచ్చే ధనం ఇంకేదీ లేదు. విద్యావంతులను రాజులు కూడా పూజిస్తారు. చదువు లేనివాళ్ళు మనుషులే కారంటే అతిశయోక్తి కాదు.