నెమలి ఈకలు ఇంట్లో ఉంచుతున్నారా... ఈ నిజాలు తెలుసా!

 

నెమలి ఈకలు ఇంట్లో ఉంచుతున్నారా... ఈ నిజాలు తెలుసా!


నెమలి ఈకలు చాలామంది తమ ఇళ్లలో ఉంచుతుంటారు.  నెమలి ఈకలు ఇంట్లో ఉండటం చాలా మంచిదని నమ్ముతారు.  నెమలి ఈకలు ఇంట్లో ఉండటం వల్ల శ్రీకృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. అలాగే నెమలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కనుక.. నెమలి ఈకలు ఇంట్లో ఉంటే పాములు రావని,  సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటుందని కూడా చెబుతారు. అయితే నెమలి ఈకలు ఎక్కువ కాలం పాటు ఇంట్లో ఉంచుకోవడం వెనుక కొన్ని ఊహించని విషయాలు కూడా ఉన్నాయి. నెమలి ఈకలు ఇంట్లో ఎక్కువ కాలం ఉంచుకోకూడదా? దీనికి గల కారణాలు ఏంటి? తెలుసుకుంటే..

నెమలి ఈకలను ఎక్కువ కాలం పాటు ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లోని సానుకూల శక్తి బలహీనపడుతుందట. పాత నెమలిఈకలను ఎక్కువ సేపు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదట.  నెమలి ఈకలు రెండు మూడు నెలల తర్వాత వాటి సానుకూల శక్తిని కోల్పోతాయట. దీనికి ప్రధాన కారణం వాటి పరిశుభ్రత అంటున్నారు.

నెమలి ఈకలు సులభంగా దుమ్మును ఆకర్షించే సహజ గుణం కలిగి ఉంటాయి. ఈకలపై దుమ్ము పేరుకుపోయినప్పుడు వాటి మెరుపు,  శక్తి బలహీనపడుతుంది.

ఇంట్లో నెమలి ఈకలు ఉంచుకోవాలంటే ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవడం మంచిది.  దీని వల్ల వాటి శక్తి చురుగ్గా ఉంటుందట.

నెమలి ఈకలు ఇందుకే ఉంచాలి..

నెమలి ఈకలను చెడు దృ్టి నుండి రక్షణ కోసం,  ప్రతి కూల శక్తులకు వ్యతిరేకంగా ఉంచుతారు. నెమలి ఈకలను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో అందరికీ రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఇంట్లోకి చెడు శక్తులు ఏవీ ప్రవేశించవని చెబుతారు.

కానీ నెమలి ఈక శక్తి కోల్పోతే..

నెమలి  ఈకలో శక్తి కోల్పోతే.. అది సానుకూల శక్తిని కలిగించడానికి బదులుగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడటానికి కారణం అవుతుందట. కుటుంబంలో,  ఇంట్లో సమస్యలను సృష్టిస్తుందని అంటున్నారు.

ఆర్థిక స్థితికి..

నెమలి ఈకలు ఇంటికి సంపదను, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.వీటిని ఉంచుకోవడం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది.  ధనాకర్షణ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.

వాస్తు ప్రకారం..

వాస్తు ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉన్న ఏవైనా దోషాలను తొలగిస్తాయని చెబుతారు.  నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆనందం,  శాంతి, శ్రేయస్సు కలుగుతాయి.

                  *రూపశ్రీ.