బ్రహ్మముహూర్తంలో గుడికి వెళితే!

 

బ్రహ్మముహూర్తంలో గుడికి వెళితే!

ప్రతి మతానికి దాని స్వంత మతపరమైన స్థలం ఉంటుంది, అక్కడ దేవుడిని ఆరాధించడానికి ఎంతో అనువుగానూ ఉంటుంది. ఎప్పుడూ కోపంగా, అవేశంగా ఉన్న వ్యక్తులు కూడా గుడికి వెళ్లగానే నెమ్మదిగా మారిపోతుంటారు. దైవం మీద  భయం, భక్తి ఒక కారణమైతే దేవుడి గుడిలో ఉండే ఒకానొక వైబ్రేషన్ మనిషి మీద చూపించే ప్రభావం రెండోది. హిందులు గడికి వెళ్లి దైవాన్ని దర్శించుకుంటారు. పూజలు చేస్తారు. నాస్తికులు ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకాలని కొట్టేస్తారు. గుడికి వెళ్లేవారిని అనాగరికులుగా భావిస్తుంటారు. కానీ  గుడికి వెళ్లడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ గుడికి వెళ్లడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

 ఆలయాన్ని దర్శించడానికి బ్రహ్మ ముహూర్తం సరైన సమయం. ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తానికంటే ముందే నిద్రలేచి  స్నానం చేసి గుడికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి.ఈ అలవాటు భగవంతుడితో అనుబంధాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

శాస్త్రీయ కారణాలు..

ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తానికి గుడికి వెళ్లడం అలవాటు చేసుకుంటే సూర్యుడి లేత కిరణాలు శరీరం పైన పడతాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. శరీరంలో కొత్త శక్తి నిండుతుంది. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు భావనలు తొలగిపోతాయి. కోపం, ఆవేశం సద్దుమణుగుతాయి.

జ్యోతిష్యం ఏం చెబుతుందంటే..

జ్యోతిష్యం ప్రకారం ప్రతిరోజూ గుడికి వెళ్లేవారికి గ్రహాలు, నక్షత్రాల చెడు ప్రభావం ఉండదు. వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల శని దోషం, రాహు-కుజ దోషం మొదలైన వాటి ప్రభావం తగ్గుతుంది. జీవితంలో చెడు సంఘటనలు జరిగే అవకాశం చాలా తగ్గుతుంది.

రోజూ గుడికి వెళ్ళేవారు తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. దానివల్ల కుటుంబ సమస్యలు కూడా మెల్లిగా తగ్గుముఖం పడతాయి. దీనితో పాటు జీవితంలో అన్ని సమస్యలు కూడా క్రమంగా తగ్గుతాయి.

                                         *నిశ్శబ్ద.