Pippaladudu

 

పిప్పలాదుడు

Pippaladudu

 

పిప్పలాదుడు దధీచి కుమారుడు. తండ్రి ప్రాణత్యాగం చేసే సమయానికి పిప్పలాదుడు గర్భస్థ శిశువు.

పెరిగి పెద్దవాడైన పిప్పలాదుడు తన తండ్రి దధీచి ఆయుధాల కోసం ప్రాణత్యాగం చేశాడన్న వార్త తెలుసుకుంటాడు.

తన తండ్రి మరణానికి దేవతలే కారణమని పిప్పలాదుడు భావిస్తాడు.

దేవతలపై పగబూని, శివుడి గురించి పిప్పలాదుడు తపస్సు చేస్తాడు.

శివుడు ప్రత్యక్షం కాగా, దేవతలను సంహరించే శక్తి కల కృత్య అనే శక్తిని వరంగా పొంది, దేవతలను సంహరింపుమని కృత్యను ఆదేశిస్తాడు.

పిప్పలాదుని ఆదేశం మేరకు కృత్య దేవతలను సంహరించడానికి బయలుదేరుతుంది.

విషయం తెలుసుకున్న దేవతలు, పిప్పలాదుని వద్దకు వచ్చి దధీచి విషయంలో జరిగిందంతా వివరించి, దధీచి ప్రాణత్యాగం చేయడంలో తమ తప్పేమీలేదని, తమకు సంహరించే యోచన మానవలసిందిగా పిప్పలాదుని ప్రార్థిస్తారు.

పిప్పలాదుడు తరుణోపాయం సూచించవలసిందిగా శివుని వేడుకుంటాడు.

శివుడి సూచన ప్రకారం కృత్యను గంగలో బడబరూపంలో నివశించమని పిప్పలాదుడు సూచిస్తాడు.

అలా కృత్యను ఉపసంహరించుకుంటాడు పిప్పలాదుడు. పిప్పలాదుని భార్య పద్మ.

Pippalada son of Dadheechi, story of Pippalada, Pippalada's father dadhichi, pippaladuni tapassu