Goutama Maharshi

 

‘గౌతమి’ని భువికి తెచ్చిన గౌతముడు

Goutama Maharshi

 

సప్తఋషులలో ఒకడు గౌతముడు. అహల్య వివాహ సమయమున ఇతడి పేరు వినిపిస్తుంది.

బ్రహ్మ అతిలోకసుందరిఅయిన ఒక యువతిని సృష్టించి, ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు. ఆమెకు వివాహం చేయాలనుకుని ‘ఎవరు ముందుగా భూమిని చుట్టివస్తారో వారికి ఈమెనిచ్చి వివాహం చేస్తా’ నని ప్రకటించాడు.

అహల్యను వివాహం చేసుకోవడానికి వచ్చిన ఇంద్రుడు, తదితర దేవతలు భూమిని చుట్టిరావడానికి వెళ్తే, గౌతముడు, రెండు ముఖాలున్న ఆవుకు ప్రదక్షిణ చేసి వచ్చాడు. ఇది భూప్రదక్షిణతో సమానమని భావించి, బ్రహ్మ, అహల్యకు గౌతముడితో వివాహం జరిపించాడు.

తను చల్లిన విత్తనాలు వెంటనే ఫలాలనివ్వాలని గౌతముడు బ్రహ్మను వేడుకోగా, బ్రహ్మ దానికి అంగీకరించాడు.

గౌతముడు ఆ వర ప్రభావంతో తన ఆశ్రమానికి వచ్చిన అతిధులకు భోజనాదులు సమకూర్చేవాడు.

ఒక సంవత్సరం విపరీతమైన కరువు వచ్చింది. ఎక్కడా ఆహారం దొరకని పరిస్థితుల్లో ప్రజలు గౌతముడి వద్దకు వెళ్ళడం ప్రారంభించారు. గౌతముడు తన వద్దకు ప్రజలకు వరప్రభావంతో పండిన పంటతో భోజనం సమకూర్చేవాడు.

చివరకు ఇది విపరీతధోరణికి దారితీయడంతో వినాయకుడి ప్రేరణతో ఒక గోవు అక్కడకు వచ్చి, పంట పొలాలను తినేయడం మొదలు పెట్టింది.

ఒక దర్భతో గౌతముడు, ఆ గోవును విదిలించగా ఆ గోవు అక్కడికక్కడే చనిపోయింది.

గోహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఆ ప్రాంతంలో గంగను ప్రవహింపజేయాలని ఇతర నది రూపంలో రప్పించాడు.

గౌతమ ముని ప్రేరణతో ఏర్పడిన అ నదికి గౌతమి అనే పేరు వచ్చింది. గోదావరి నుంచి చీలిన నదులలో ఒక చీలికను గౌతమి అని పిలుస్తారు.

రామాయణంలో అహల్యకు శాపవిముక్తి సమయంలో కూడా గౌరమ ముని ప్రస్తావన కనిపిస్తుంది.

గౌతముడికి శతానందుడనే కుమారుడు, అంజన అనే కుమార్తెలు సంతానం.

 

Goutama maharshi and ahalya, the story of goutama muni, Brahma and goutama maharshi, saptarshulu goutama muni, brahma creates ahalya