స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా
భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని అంటారు. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురూ, రెండుచేతులూ, రెండు కాళ్ళూ, రెండు కనులూ భూమిపై ఆన్చి చేయునది. ఇలా పురుషులు చేయవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వలన గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం వుంది. అందుకే మనవారు ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచించారు. ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించవచ్చు. ఇలా శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేయబడింది. అది పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలని తెలుసుకోవాలి.