నుదుటన కుంకుమ ఎందుకు ధరించాలి
నుదుటన కుంకుమ ఎందుకు ధరించాలి
శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత. అలాగే లలాటానికి అధిదేవత బ్రహ్మదేవుడు. లలాటం బ్రహ్మ స్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. ఇంకా లలాటాన్ని సూర్యకిరణాలు తాకరాదు. అందుకొరకు కూడా కుంకుమను నుదుట ధరించాలి.
ఇక కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే సంశయం చాలామందిలో ఉంటుంది. అయితే కుంకుమను ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కో ఫలితం కలుగుతుంది. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వెలితో ధరిస్తే శక్తి కలుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తీ, ముక్తీ కలుగుతాయి.
ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం కన్నా మేలు రకం కుంకుమ ధరిస్తే క్రిమి సంహారకము. కుంకుమను రోజూ ధరించండి. నుదుటన కుంకుమ అద్దితే జ్ఞానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. అందం, అలంకరణలో భాగం మాత్రమే కాదు ఇవన్నీ కుంకుమధారణ వెనుక ఉన్న అంశాలు.