నెగిటివ్ ఆలోచనలు వేధిస్తున్నాయా.. వెంటనే ఈ మంత్రాలు పఠించండి!
నెగిటివ్ ఆలోచనలు వేధిస్తున్నాయా.. వెంటనే ఈ మంత్రాలు పఠించండి!
ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటే జీవితం ఎంతో బాగుటుంది. కానీ నేటికాలంలో చాలామంది నెగిటివ్ ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలు ఉన్న జీవితం చాలా దుర్బరంగా ఉంటుంది. జీవితం చాలా బాధ పెడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో నెగిటివ్ గా ఆలోచించడం, ఎవరేం చెప్పినా నెగిటివ్ గా అనిపించడం, చుట్టూ ఉన్న వాతావరణం నెగిటివ్ గా అనిపించడం ఏదైనా పని చేయాలనుకున్నా నెగిటివ్ గా ఉండటం.. ఇవి మాత్రమే కాకుండా చెడు ఆలోచనలు రావడం, చెడ్డ పనులు చేసే దిశగా మనసు పుట్టడం, అసభ్యకరమైన పనులపైన దృష్టి పడటం. ఇలా చాలా విషయాలు నెగిటివ్ గా అనిపిస్తాయి. అయితే నెగిటివ్ విషయాల నుండి మనసు మళ్లించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవుతూ ఉంటారు. కానీ కొన్ని మంత్రాలు నెగిటివ్ ఆలోచనలను దూరం చేయడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..
ప్రతికూల ఆలోచనలను దూరం చేసే 5 మంత్రాలు..
దుర్గా మంత్రం..
"ఓం దుం దుర్గాయై నమః"
దుర్గా దేవి మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి కలిగించడమే కాకుండా, వ్యక్తి చుట్టూఉండే ప్రతికూల వాతావరణాన్ని కూడా తొలగిస్తుంది. ఇది శత్రువుల నుండి కాపాడుతుంది. ఒక విధంగా, ఈ మంత్రం మనిషిలోనూ, మనిషి చుట్టూ ఉండే ప్రతికూలతకు నుండి ఒక కవచంలా పనిచేస్తుంది.
గాయత్రీ మంత్రం..
'ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్'
ఈ మంత్రం శరీరాన్ని, మనస్సును శుద్ధి చేయడంలో , ప్రతికూల శక్తిని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది. మంచి చెడులను అర్థం చేసుకునే శక్తిని మనకు ఇస్తుంది.
హనుమాన్ మంత్రం..
'ఓం హను హనుమతే నమో నమః'
ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు భయంగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే, హనుమాన్ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, సానుకూల దృక్పథం వృద్ధి చెందుతుంది.
మహా మృత్యుంజయ మంత్రం..
శివుని మంత్రాలలో అతి శక్తివంతమైన మంత్రం ఇది. భయం, అకాల మరణం, ప్రతికూలత మొదలైన వాటి నుండి రక్షించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
హనుమాన్ చాలీసా..
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల తక్షణమే సానుకూలత చేకూరుతుంది. కష్టాల నుండి రక్షిస్తుంది, పఠించే వారి చుట్టూ ప్రతికూలత చేరకుండా నిరోధిస్తుంది.
*రూపశ్రీ.