Read more!

Ravanasura

 

దశగ్రీవుడే రావణుడు

Ravanasura

 

విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు ఎత్తిన రెండవ అవతారం రావణ, కుంభకర్ణులు. రామాయణ గాథలో వీరిద్దరి పేర్లూ కనిపిస్తాయి. మూడవ బ్రహ్మ అయిన విశ్వవుకు సుమాలి అనే కూతురు ఉంది. ఆమె కూతురు కైకసి. ఆమెకు విశ్రవశువునికి జన్మించిన కుమారుడు రావణాసురుడు. విశ్రపసునికి, కైకసికి ముగ్గురూ కుమారులు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని ఒక కథనం కాగా, విశ్రవశుని తపస్సుకు భయపడి, ఇంద్రుడు ముగ్గురు స్త్రీలను పంపగా వారి వల్ల విశ్రవశువునికి రావణ కుంభకర్ణాదులు జన్మించారని మరో కథనం ఉంది. ఇంద్రుడు పంపిన స్త్రీలలో ఋప్ఫోత్కటకు రావణ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, పాకకు ఖరుడు, శూర్పణఖ జన్మించారు.

రావణునికి విశ్రవశుడు పెట్టిన పేరు దశగ్రీవుడు. రావణాసురుడికి దశకంఠుడని పేరు. అంటే పదితలలున్నవాడని అర్థం. పదితలలు ఉండడానికి ఒక కారణమున్నది. రావణాసురుడు గత జన్మలో హిరణ్యకశిపుడు. నృసింహస్వామి తనను సంహరించు సమయమున “ఇరవై ఆయుధాలతో (గోళ్లతో) నన్ను చంపడం న్యాయమా?” అని ప్రశ్నించగా, “వచ్చే జన్మలో ఇరవై చేతులు, పది తలలతో పుడతావని, అప్పుడు నేను సామాన్యుని వలె సంహరిస్తాను” అని నరసింహస్వామి అనుగ్రహించాడన్నది కథనం. కుబేరుని ఓడించి అతని పుష్పక విమానాన్ని రావణుడు కైవసం చేసుకున్నాడు. లంకను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. అతని భార్య మండోదర. మేఘనాధుడు అనే కుమారుడు వీరుద్దరికీ జన్మించాడు. మహావీరుడైన కార్తవీర్యార్జుని చేతిలో రావణుడు ఒకసారి, వాలి చేతిలో మరొకసారి యుద్ధములో ఓడిపోయాడు.

ఆ తర్వాత అతడిని యుద్దంలో ఓడించినది రాముడు మాత్రమే. రావణుని సోదరుడు కుంభకర్ణుడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా, వరమిచ్చే సమయంలో సరస్వతీ దేవి ప్రభావంతో “ఆరు నెలలు నిద్ర, ఒక రోజు ఆహరం” చొప్పున కోరుకున్నాడు, ఆరునెలల నిద్రాభంగం చేస్తే అతని శక్తి తగ్గుతుందని, పూర్తి నిద్రపోయి, పూర్తి ఆహరం తీసుకుంటే మాత్రం అతడిని ఓడించేవారే ఉండరని బ్రహ్మ వరమిచ్చాడు. ఆరునెలల నిద్ర పూర్తి కాకముందే లేచి రామునితో యుద్ధానికి వెళ్లవలసి రావడంతో కుంభకర్ణుడు మరణించాడు.