Grastudu

 

కర్ణుడిని కీటకముగా పీడించిన గ్రస్తుడు

Grastudu

 

గ్రస్తుడు ఒక రాక్షసుడు. శాపవశాత్తూ కీటకముగా జన్మించాడు. ‘తను బ్రాహ్మణుడును’ అని కర్ణుడు పరశురాముని వద్ద అస్త్ర, శాస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయాన ఒకరోజు కర్ణుడి తొడ మీద పరశురాముడు తల వుంచి నిద్రపోతుంటాడు. ఆ సమయాన కీటక రూపంలో వున్న గ్రస్తుడు కర్ణుడి తొడను తొలవడం ప్రారంభిస్తాడు. అయితే పరశురాముడికి నిద్రాభంగమవుతుందనే ఉద్దేశంతో కర్ణుడు కదలక అలాగే కూర్చుంటాడు.

నిద్ర నుండి లేచిన తర్వాత పరశురాముడు ధారలు కట్టిన రక్తాన్ని చూసి హడలిపోతాడు. ఏమాత్రం భయపడకుండా, నిశ్చలంగా ఉన్న కర్ణుడిని అనుమానించి ‘నీదే కులము’ అని ప్రశ్నించగా, నిజం చెబుతాడు కర్ణుడు. దానితో ఆగ్రహించిన పరశురాముడు కర్ణుడిని ‘ఇలా మోసంతో నేర్చుకున్న విద్య అవసర సమయంలో జ్ఞప్తికి రాదని’ శపిస్తాడు. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ఓడిపోవడానికి ఈ శాపం ఒక కారణమైతే, ఆ శాపానికి కారకుడు గ్రస్తుడు.