ఎన్ని కష్టాలు వచ్చినా

 

 

ఎన్ని కష్టాలు వచ్చినా

 

 

 

జీవనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్‌

దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం

దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా

తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!

చెరువులోని నీరు ఎండిపోయినప్పటికీ... అందులో ఉండే చేప చిట్టచివరికి మిగిలే కాస్త తేమని సైతం ఉపయోగించుకుని బతుకుతున్నట్లు... రామనామము మీద మనసుని నిల్పినవాడు, ఎట్టిపరిస్థితులలోనూ దానిని వీడక ఆ నామము మీదే మనసుని లయం చేసి జీవితాన్ని తరింపచేసుకుంటాడు.