అలాంటివారి జోలికి పోవద్దు

 

 

అలాంటివారి జోలికి పోవద్దు

 

 

ఉద్భాసితాఖిల ఖలస్య విశృంఖలస్య

ప్రోద్గాఢ విస్తృత నిజాధమ కర్మవృత్తేః ।

దైవాదవాప్త విభవస్య గుణ ద్విషోఽస్య

నీచస్య గోచర గతైః సుఖమాప్యతే కైః ॥

దుర్మార్గులకు చేయూతనిచ్చేవాడు, దర్మాన్ని పాటించనివాడు, దైవదత్తంగా లభించిన సంపద తనదే అని మిడిసిపడుతూ... తన దైన్యమైన గతాన్ని మర్చిపోయేవాడు పరమనీచుడు. అలాంటి నీచులను ఆశ్రయించినవారు ఎలాంటి సుఖాన్నీ పొందలేరు. కాబట్టి అలాంటి నీచులను ఆశ్రయించరాదు.