తోబుట్టువు అయినా సరే!
తోబుట్టువు అయినా సరే!
కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా
పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
కట్టడ (ధర్మము) తప్పినవారు తోబుట్టువులైనా సరే... వారి నుంచి దూరం జరగడం మంచిది. మదాంధుడై రావణాసురుని నుంచి విడిపడిన విభీషణుడు రాముని చెంతకు చేరాడు. అలా ధర్మం కోసం రాముని పక్షాన చేరిన కారణంగా చిరంజీవిగా చిరకాలం లంకను ఏలాడు.