Read more!

Dashavatara Is True

 

దశావతారాలు నిజంగా ఉన్నాయా?!

Dashavatara Is True

 

దశావతారాల గురించి మనందరికీ ఎంతోకొంత తెలుసు. అయితే అందులో ఎంత నిజం ఉంది అని చాలామందికి చాలాసార్లు సందేహం వస్తుంటుంది. నిజంగా దశావతారాలు ఉన్నాయా, విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తాడా, అది ఎంతవరకూ సాధ్యం, దశావతారాల కథనాలు అన్నీ పుక్కిటి పూరాణాలేనా, అది నిజమని నమ్మేందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా - అని ఎప్పుడో ఒకప్పుడు ఆలోచిస్తుంటాం. అందుకే దశావతారాల గురించిన సందేహాలు, సంశయాలు తీర్చుకునే ప్రయత్నం చేద్దాం.

 

మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనుడు, శ్రీరామచంద్రుడు, పరశురాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు - ఈ పదీ దశావతారాలు. శాస్త్రీయంగా ఈ దశావతారాలు ఎంతవరకూ నిజమో తెలియాలంటే ఒకసారి డార్విన్ సిద్ధాంతాన్ని గుర్తుచేసుకోవాలి.

 

సృష్టిలో మొదట జీవరాశులు నీటిలో పుట్టాయి. నీళ్ళలో పుట్టిన జీవజాలంలో సముద్రంలో జీవించగలిగినవి మత్స్యం, కూర్మం. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యం అంటే చేప. ఈ మత్స్యావతారంలో విష్ణుమూర్తి ప్రళయకాలంలో జీవరాసులను నావలో ఎక్కించి జలనిధిని దాటించాడు. ఇంకా వేదాలను రక్షించాడు.

 

దశావతారాల్లో రెండవది కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. దేవతలు, రాక్షసులు, మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. అప్పుడు మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా, విష్ణుమూర్తి కూర్మావతారమెత్తి దాన్ని భరించాడు.

 

జలచరాల తర్వాత కొన్ని పశువులు, పక్షులు పరిణతి చెందాయి. వాటిల్లో వరాహం ఒకటి. వరాహావతారం విష్ణుమూర్తి అవతారాల్లో మూడవది. వరాహం భూమిమీద జీవించినప్పటికీ నీళ్ళలో, బురదలో ఎక్కువగా కనిపిస్తుంది. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలోకి వేసిరేయగా నీటి అడుగున బురదలోకి వెళ్ళి తన మూతిపై నిలిపి రక్షించింది వరాహావతారమే.

 

మృగాల తర్వాత మానవావతారం అంకురించే దశ నరసింహావతారం. దశావతారాల్లో నాల్గవ అవతారం వామనావతారం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని మట్టు పెట్టేందుకు ఒక స్తంభంలోంచి నరసింహావతారంగా వచ్చి సంహరించాడు.

 

ఆపైన మరిరింత అభివృద్ధి చెందిన దశలో ఆదిమానవుడు ఉద్భవించాడు. దానికి సంకేతం వామనావతారం. దశావతారాల్లో ఐదవ అవతారం వామనావతారం. విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగుల నేల కావాలంటూ బిక్షాటన కోరాడు. ఒక అడుగు భూమిమీద, రెండో అడుగు దేవతాలోకంపై, మూడో అడుగు బలిచక్రవర్తి శిరసుపై ఉంచి పాతాళానికి అణిచేశాడు.

 

ఆదిమానవుడు దినదినప్రవర్ధమానం చెంది పాడి పశువులను చేరదీసి, వ్యవసాయం చేశాడు. అందుకు చిహ్నం గొడ్డలి చేపట్టిన పరశురాముని అవతారం. దశావతారాల్లో ఆరవ అవతారం పరశురాముడు. తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు కన్నతల్లిని గొడ్డలితో నరికిన పరశురాముడు, తిరిగి తండ్రి ద్వారానే తల్లిని బతికించుకున్నాడు.

 

జీవితంలో ఎన్ని ఉన్నా, కష్టనష్టాలు తప్పవని, దుఃఖం వెన్నంటి ఉంటుందని, దాని జయించడానికి ధర్మబద్ధంగా నడచుకుంటూ ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గ్రహించి, కోరికల అతీతంగా జీవించాలని చాటి చెప్పేందుకు నిదర్శనంగా బుద్ధుడు అవతరించాడు. ఇక దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల అవతారాలు సరేసరి.

 

ఇప్పుడు చెప్పండి.. దశావతారాలు అతిశయంలా, అసత్యంలా అనిపిస్తోందా?! లేదు కదూ! విష్ణుమూర్తి దశావతారాలు కేవలం కల్పన కాదు. అబ్బురాలో, అబద్ధాలో కావు. ఆయా కథలన్నీ నిజానికి దగ్గరగానే ఉన్నాయి. ధర్మసంస్థాపనే లక్ష్యంగా నిలుస్తాయి.

 

Dashavatara, 10 incarnations of vishnumurthy, Vishnumurthy Dashavatar, Kurma matsya Vaman avatar, Dashavatar in Garuda Purana, Dashavatar of V t ishnu stories