పెద్దల సలహా

 

పెద్దల సలహా

 

ఆపజ్జలనిమగ్నానాం హ్రియతాం వ్యసనోర్మిభిః
వృద్ధవాక్యైర్వినా నూనం నై వోత్తారం కథంచన

నీటిలోకి దిగి ఈత కొట్టాలని ఎవరికి మాత్రం సరదాగా ఉండదు. కాకపోతే అందులో ఎక్కడ ఏ ఆపద ఉంటుందో తెలియదయ్యే! అలాగే జీవితం అనే సముద్రంలోనూ లెక్కలేనన్ని ఆపదలు కాచుకుని ఉంటాయి. వాటిని ఒడుపుగా ఎదుర్కొనేందుకు పెద్దలు చెప్పే సలహాలు ఉపయోగపడతాయి.