ప్రహ్లాదచరిత్ర

 

తన సోదరుడైన హిరణ్యాక్షుని జంపినాడును కోపముతో హిరణ్యకశిపుడు శ్రీహరిని వధించుటకై బయలుదేరును. విష్ణు వది యెరిగి సుక్ష్మరూపుడై ఆ రాక్షసుని గుండెల్లో దాగియుండెను. అన్ని లోకములను శ్రీహరికై వేదికి వెదికి, అతడు కానరాకపోవుటచే, తన పరాక్రమము విని శ్రీహరిని గుండెలు పగిలి చచ్చియుండునని తలచి రాక్షసుడు వెదుకుట విరమించెను. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు .వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మాతృగర్భములో నున్నప్పటి సంగతి యిది. ఒకసారి హిరణ్యకశిపు డింటిలో లేని సమయంలో చూచి ఇంద్రుడు గర్భవతియైన లీలావతి నెత్తుకొని పోవుచుండగా నారదు డేడురై “యిదేల?” అని ప్రశ్నించగా.

“హిరణ్యకశిపునకు బుట్టెడి వాడింకెంత దుర్మార్గు డగునో యని యిమేను, గర్భస్థశిశువును చంపుద మనుకొన్నా” నని ఇంద్రుడు డనగా నారదుడు, “ఈమె గర్భమున బుట్టేడివాడు దేవతలకు మిత్రుడే. ఈమేను నా యాశ్రమములో నిలిపి రక్షించెద” నని యామెను గోనిపోయేను. ఆమెకు విష్ణుకథలు వినిపించుచు ఆమెను, ఆమె కడుపులో నున్న ప్రహ్లాదుని విష్ణుభక్తులుగా తీర్చిదిద్ది, హిరణ్యకశిపు నింట దిగవిడిచెను. ప్రహ్లాదుడు భూతదయ గలవాడు. పెద్దలయందు వినయము గలవాడు. పరస్త్రిలను తల్లులుగా భావించేడివాడు. ఆటలలోగూడా అసత్యమాడడు. సర్వకాల సర్వావస్థలయందును హరినామస్మరణ మానలేదు. రాక్షసరాజు తన కొడుకును జుచి చదువనినా డజ్ఞాని యగునని చండామార్కులను బిలిచి యప్పగించేను.

ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడా తన హరినామస్మరణము మానలేదు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరిక్షి౦చ దలచి పిలచి యడుగగా, “చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు”అనుచు విష్ణుమహిమను గుర్చి యుపన్యసించేను. రాక్షసరాజు గురువులపై కోపి౦చగా వారాతనిని మరల గురుకులమునకు దిసుకుపోయి రాక్షసోచితవిద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు “చదువులో మర్మమెల్ల చదివినా”ననుచు “విష్ణుభక్తియే సంసారతరణోపాయ”మనెను. అదివిని హిరణ్యకశిపుడు మహాకోపముతో భటులను పిలిచి వీనిని చంపుడని యజ్ఞాపించేను. వారు శూలముతో బోడిచిరి. ఏనుగులతో త్రోక్కించిరి. పాములచే గరిపించిరి. సముద్రములోముంచివేసిరి.కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి.ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు.కొంచెము గూడా భయపడలేదు. కందలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చింతించుచుండగా చండామార్కులు “చిన్నతనముచేత వీ డిట్లున్నాడు కాని పెద్ది యైనచో బాగుపడును.

వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో గొట్టేను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.

హిరణ్యకశిపు డతనితో యుద్దమునకు తలపడెను. కాని నరసింహు డాతనిని బట్టుకొని తొడలపై బెట్టుకొని గోళ్ళతో చీల్చి సంహరించేను. ఆ ఉగ్రనరసింహుని జూచి లోకము లన్నియు భయపడెను .కాని ప్రహ్లాదుడు భయపడక అతనికి నమస్కరించగా అతడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయుంచేను. ఆ బాలుడు మహా జ్ఞానియై దేవుని స్తుతించేను. అయన “నికే వరము కావలెనో కోరు”మనగా, “కామములు వృద్ధి పొందని వరమి”మ్మని ప్రార్ధించేను. ఆ దేవుడు మెచ్చి , “ప్రహ్లాదా! నివు నిష్కామబుద్ధితో ఈశ్వరార్పణముగా సకల కార్యములు చేయుచు రాక్షసరాజ్యమును పాలించి చివరికి నన్ను చేరదవు” అని పలికి, తన్ను జూడ వచ్చిన బ్రహ్మతో “ రాక్షసుల కిట్టి వరము లెన్నడు ఇయ్యకు “మని చెప్పి యద్రుశ్యుడయ్యను.