చిత్ర కేతూపాఖ్యానము

 

చిత్రకేతుడు శురసేనదేశమునకు రాజు . సంతానము కొఱకు కోటిమంది స్త్రిలను పెండ్లాడేను.కాని ఫలము లేకపోయేను. ఒకనా డంగిరసుడను ముని అతని మందిరమునకు రాగా, రాజు పూజించి, తన అపుత్రత్వమును గుర్చిచెప్పెను. అంగిరసుడు రాజుచేత పుత్రాకామేష్టి చేయించి యజ్ఞప్రసాదము నాతని పట్టపురాణి కృతద్యుతికి ఇచ్చెను. రాజునకు కుమారుడు పుట్టెను .అ రాజు పుత్రుని మొహములో బడి , వానిని వాని తల్లిని మిక్కిలి ఆదరించేను. ఇది తక్కిన రాణులకు కంటగిం పయ్యను. వారు బాలునికి విషము పెట్టి చంపిరి . మరణించిన బాలునికై రాజును రాణియు విలపించుచు౦డగా అంగిరసుడు నారదునితో వచ్చి రాజుతో ఇట్లనెను.”రాజా! “ఋణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయా:” అందురు .

(పశువులు , భార్యలు,కొడుకులు, ఇండ్లు ||ఋణములు బట్టి వచ్చును పోవును.) జగత్తు స్వప్నమువంటిది. స్వప్నము నిజముగునా? కర్మవశమున జీవులు పుట్టి గిట్టిచుందురు. నీకు వీడేమగును ?వానికి నీవే మగుదవు? ఇదంతయు భౌతికదేహ మున్నంత వరకే. నివు శ్రీహరిని ధ్యానించుచు మోహవికారములు త్యజింపుము’’. నారదుడు, “రాజా!నీకును వీనికిని బంధుత్వ మేమున్నదో చూడు” మని బాలుని దేహము జూచి , “జీవా! మీ తల్లితండ్రులు నీకై దుఃఖి౦చుచున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశి౦చి వీరికి సంతోషము గలిగింపు”మనెను. బాలుడు , “కర్మబద్ధుడనై అనేక జన్మము లేత్తుచున్న నాకు వీరే జన్మలో తల్లి తండ్రులు ?ఒక్కక్క జన్మలో వేర్వేరు తల్లితండ్రులు బ౦ధువులు నాకేర్పడుచున్నారు. సర్వేశ్వరుడైన శ్రీపతి తన మాయాధీనులను జేసి జీవులను పుట్టించుచు తిరిగి తనలో లీనము చేసికోనును.

అని పలికి అ జీవుడు వెళ్లిపోగా చిత్రకేతుడు మోహము విడిచి బాలునికి యమునానదిలో ఉత్తరక్రియలు చేసెను. నారదునకు నమస్కరింపగా అతడు రాజునకు నారాయణమంత్రము ముపదేశించేను. నియమనియనిష్ఠలతో ఏమంత్రమైనా ఏడు రోజులు జపించినచో సిద్ది కలుగును . రాజట్లు ఏకాగ్రతతో ఏడు రోజులు లా మంత్రము జపి౦చగా ముకుందుడు ప్రసన్నుడై విద్యాధరాధిపత్యము, విమానము అనుగ్రహించేను. ఒకనాడతను విమానము పై కైలాసము మీదుగా బోవుచు కొలువులో నున్న శంకరుని దర్శనము చేసుకొని నమస్కరించెను . ఒకే పీఠ౦ముపై పార్వతి ని తోడ మీద కూర్చో౦డబెట్టుకొన్న శివుని జూచి “మీరు ప్రకృతి పురుషులు కావచ్చు .ఏకాంతసమయంలో నిట్లు కూర్చోండవచ్చుగాని నిండుసభలో నిట్లు౦డుట న్యాయమా?”అని యాక్షేపించేను. పార్వతి కోపించి , “ఇందరును ఏ మనలేదుగాని నీవు మాత్రము అధిక్షేపించెదవా? ఇంత అహంకారముగల నీవు రాక్షసజన్మ మెత్తుము “అని శపించెను. చిత్రకేతుడు తన తప్పు తెలిసికొని ఉమాశంకరులకు నమస్కరించి “అమ్మా! జీవులకు వారివారి కర్మములవలన జననమరణములు , సుఖదుఃఖములు కలుగుచుండుననుటకు కిదియే నిదర్శనము . న న్ననుగ్రహింపుము .నీ శాపమునకు నేను భయపడటంలేదు .జగత్పితరులైన మిమ్ము అధిక్షేపించినందుకు చింతించుచున్నా”నని మ్రొక్కి వెడలిపోయేను.

తరువాత అందరు వినుచుండగా పార్వతితో శివుడు “చూచితివా ? విష్ణు భక్తులు నిస్స్రుహత్వము !వారికి సుఖదు:ఖములు సమానములు .తిరిగి నీకు శాప మియ్యగలవాడైనను శంతుడుకాన నీ శాపమును తలదాల్చి వెడలిపోయేను”అని పలికేను. అతడే త్వష్ట చేసిన పుత్రకామేష్టిలో దక్షిణాగ్నియందు వృత్రాసురుడు జనించెను .అతనికి అ ధర్మము , జ్ఞానము పూర్వజన్మమునుండి సంక్రమి౦చినవే. వారట్లేల ఇంద్రుని విదిచిపోయిరని పరిక్షిత్తు అడుగగా శుకడిట్లు చెప్పెను . వృత్రపరాక్రమునకు భయపడి దేవతలు ,మునులు ఇంద్రునొద్దకు వచ్చి ''నీవు వృత్రసురును వధి౦పు ''మనగా అతడు ''పూర్వము ఇట్లే మీ మాటలు విని విశ్వరూపుని జంపినాను .ఆ దోషము పోగొట్టుకొనుటకు నాకు తలప్రాణము తోకకు వచ్చినది .మరల ఇంకొక బ్రహ్మహత్యకు ఒడిగట్టలే''నని నిరాకరించెను .దానికి మహర్షులు ''నీ చేత మే మశ్వమేధాయాగము చేయించి పాపవిముక్తిని జేయుదు''మని చెప్పి సురరాజును ఒప్పించిరి. అందుకే వృత్రుని జంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను. ఆ పాపము ఒక చండాల స్త్రి రూపమున ఇంద్రుని వెంటబడెను .ఇంద్రుడు పారిపోయి మానససరస్సులోని తామర కాడలో దాగుకొనేను.

అందున్న దారాలతో కలసిపోయి ఒక రూప మన్నది లేక వేయేండ్లు ఉండెను .అది శివునిదిక్కు (ఉత్తరము ).కాన చండాలి అచటికి పోలేక ఇంద్రునికై బయట కాచుకొని కూర్చుండేను. అంతకాలము స్వర్గరాజ్య మరాజకము కాకూడదని , భూలోకము నుండినూ అశ్వమేధయాగములుచేసిన నహుషుడను రాజును దెచ్చి దేవతలు , ఋషులు ఇంద్రపదవిలో నిలిపిరి .అతడా పదవిలో మదించి , శచీదేవిని భార్యగా నుండమనినిర్బధించెను.ఆమె''బ్రహ్మర్షులు మోసేడు పల్లకిలోరమ్ము.నిన్నూవరి౦చెదను''ననెను .సహుషు డట్లేవచ్చును అగస్త్యుని''సర్ప-సర్ప''(దగ్గరకు సమీపింపుము)అని కాలితో దన్నేను.ఆముని కోపించి నీవు సర్పమై భూలోకమున బడియు౦డు ''మని శపించెను .దానితో నహుషుని ఇంద్రపదవి మట్టిలోగలిసేను.

ఇంద్రుడు డా పద్మనాళములో నుండి యిన్నేండ్లును హరిధ్యానము చేయుచుండేను.మునులును, దేవతలును ఇంద్రుడున్నచోట తెలిసికోని వచ్చి అతనిని మన్నించమని కోరి స్వర్గమునకుదేచ్చిరి.పాపరూపిణియైన చండాలి, అంతకాలము విష్ణుధ్యానము చేసిన ఇంద్రుని చేరలేకపోయేను. మునులింద్రుని చేత అశ్వమేధయాగము చేయి౦చి పాపవిముక్తిని జేసిరి. ఈ వృత్రాసుర వధను జదివిన వారును వినినవారును అఖండ భోగభాగ్యాములతో తులతూగి , తుదకు మోక్షము నొందుదురు. శత్రు వెంతవాడైనను ఉపేక్షి౦పరాదు,ఇది రాజనీతి . పరిక్షిత్తు శకుని జూచి , ''మహాత్మా!అసురుడైన వృత్రున కంతటికీ ధర్మము జ్ఞానము ఏల కలిగినవి ?అని యడుగగా శుకమునీంద్రు డిట్లుచెప్పెను.