ఈ కవచం పఠిస్తే చాలు.. శని దోషం తొలగడమే కాకుండా.. ఆరోగ్యం కూడా బాగుటుంది..!
ఈ కవచం పఠిస్తే చాలు.. శని దోషం తొలగడమే కాకుండా.. ఆరోగ్యం కూడా బాగుటుంది..!
శని దేవుడిని కర్మ ఫల దాత అని అంటారు. ఎలాంటి వ్యక్తి అయినా సరే.. వారు చేసిన కర్మల ఫలితంగా మంచి, చెడులను న్యాయంగా ఇవ్వడంలో శనిదేవుడు పక్షపాతం లేకుండా ఉంటాడని చెబుతారు. అయితే చాలామంది శని దోషం, శని మహా దశ, శని అంతర్థశ, ఏలినాటి శని వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి మీద శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ శని దోషాల నుండి ఉపశమనం కలిగించే శని దేవుడి రక్ష కవచం ఉంది. దాన్ని పఠిస్తే శని దోషాలు చాలా వరకు తగ్గుతాయని చెబుతారు. దీని గురింటి మరింత వివరంగా తెలుసుకుంటే..
శనివారం సాయంత్రం..
శనివారం సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం తర్వాత శని రక్ష కవచం పఠించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జీవితంలోని సవాళ్లను నివారించడానికి సహాయపడుతుంది.
కవచం ప్రాముఖ్యత..
సాధారణంగా ఏ దేవుడి కవచాన్ని పరిశీలించినా కవచంలో శరీరంలోని బాగాలను ప్రస్తావిస్తూ ఆయా భాగాలను రక్షించమంటూ సాగుతుంది. శని రక్ష కవచం కూడా ఇలాగే సాగుతుంది. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శని రక్ష కవచం పఠిస్తే శరీరంలోప్రతి అవయవానికి శని దేవుడు రక్షణ ఇస్తాడని చెబుతారు.
సాధారణంగా శనిదోషం వల్ల చెడు కర్మకు ఏదైనా ఫలితం అనుభవించేవారిని గమనిస్తే.. వ్యాధులతో ఇబ్బంది పడటం, బంధాల మధ్య ఎడబాటు, సొంత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటి సమస్యలు ఉంటాయి. శని రక్ష కవచం పఠించడం వల్ల శరీరంలో అన్ని అవయవాలకు రక్షణ ఏర్పడుతుంది. అంటే.. శనిదోషం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య ప్రాప్తించే అవకాశం ఉన్నా.. అది చాలా చిన్న సమస్యగా వదిలిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ కవచాన్ని భక్తితో కాస్త బిగ్గరగా పఠిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు.
*రూపశ్రీ.