Read more!

శీలవంతునికి అన్నీ సుఖాలే

 

 

శీలవంతునికి అన్నీ సుఖాలే

 

 

వహ్నిస్తస్య జలాయతే జలనిధిః కుల్యాయతే తత్క్షణాన్‌

మేరుః స్వల్ప శిలాయతే మృగపతిః సద్యః కురంగాయతే ।

వ్యాలో మాల్య గుణాయతే విషరసః పీయూష వర్షాయతే

యస్యాంఙ్గే-ఖిల లోక వల్లభతమం శీలం సమున్మీలతి ॥

శీలవంతునికి ఎలాంటి సమస్య అయినా కాలిగోటితో సమానం అయిపోతుంది. అగ్ని నీరులా చల్లగా తోస్తుంది, విశాలమైన సముద్రం కాస్తా పిల్లకాలువలా మారిపోతుంది, మేరు పర్వతం చిన్న గులకరాయిలా కనిపిస్తుంది, సింహం లేడికూనలా భాసిస్తుంది, విషసర్పం పూలహారమైపోతుంది, విషం అమృతంగా మారుతుంది. ఇతరులకు దుఃఖాన్ని కలిగించే విషయాలన్నీ శీలవంతునికి సుఖాన్నే అందిస్తాయి.