రాత్రి పూజ చేసేటప్పుడు  ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు..!

 

 

రాత్రి పూజ చేసేటప్పుడు  ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు..!

 

 

హిందూ సంప్రదాయంలో పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజ చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.  ప్రతికూల శక్తి దూరం అవుతుంది. అంతేకాదు..  మనసుకు ప్రశాంతత,  ఏకాగ్రత పెరుగుతాయి.  భారతీయ ఇళ్లలో సాధారణంగా పూజకు ఉదయం సమయంలో చేస్తుంటారు. కొన్ని సార్లు సాయంత్రం సమయంలో కూడా పూజ చేస్తుంటారు.   అయితే ఉదయం పూట పూజ చేస్తే ఒక విధంగా, రాత్రి సమయంలో పూజ చేస్తే మరొక విధంగా చేయాలి. రాత్రి పూట పూజ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుంటే..


సాధారణంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ, దీపావళి లక్ష్మీ పూజ వంటివి రాత్రి సమయంలో చేస్తంటారు.  మరికొన్ని పూజలు కూడా రాత్రి సమయంలో చేయడానికి నిర్థేశించబడి ఉంటాయి. ఇలా రాత్రి పూట పూజ చేసేటప్పుడు గంట మోగించకూడదు.  దీనివల్ల సానుకూల శక్తికి బదులుగా ప్రతికూల శక్తి వస్తుంది.  చాలా సమస్యలలో అడ్డంకులు ఏర్పడతాయి.


కొన్ని పూజలలో శంఖం ఊదడం కొందరికి అలవాటు.  రాత్రి సమయం పూజలో శంఖం ఊదడం కూడా నిషిద్దం. దేవతలు రాత్రి సమయంలో నిద్రలో ఉంటారని అలాంటి సమయంలో శంఖం పూరించడం వల్ల నిద్రకు భంగం కలిగించిన వారు అవుతారని అంటారు.


రాత్రి సమయంలో తులసి ఆకులను ముట్టకూడదు.  రాత్రి సమయంలో తులసి ఆకులను ముడితే తులసికి కోపం వస్తుందని నమ్ముతారు. దీని వల్ల అనేక సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని చెబుతారు.  అంతేకాదు.. సాయంత్రం లేదా రాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు   తులసి ఆకులను కోయడం కూడా నిషిద్దం. దీనివల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. అలా సాయంత్రం సమయంలో తులసి ఆకులు కోసే ఇంట్లో లక్ష్మిదేవి నిలవదు.


రాత్ర సమయంలో పూజ చేసేటప్పుడు పూజ చేసే దిశ కూడా ప్రాధానమైనది.  రాత్రి పూట పూజకోసం ఉత్తర దిశలో పూజలు చేయాలి.  దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయి.


                                                   *రూపశ్రీ.