పరమేశ్వరుడి లీలావిలాసం......
భగవంతుడి గురించి ఎంత విన్నా ఇంకె౦త చదివినా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది .చదవాలనే అనిపిస్తుంది .ఇంతే౦దుకు !అయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకాఇంకా తెలుసుకోవాలనే అనిపిస్తుంది .ఇది సహజం .సముద్రం లోతులా 'అయన 'ఒకపట్టాన ఎవరికీ అంతుపట్టడు.ఒకవేళ పట్టాడా మనం మరచిపోయనా ,అయన మనల్ని వదలి పెట్టడు.
ఇదీ భగవంతుడి 'చిత్రం '! ఎప్పుడు కనికరిస్తాడో తెలిదు .ఎప్పుడు అగ్రహిస్తాడో అంతకన్నా తెలిదు .మంచి చేద్దామని వచ్చిన మన్మధుణి మసిచేసి వదలిపెట్టాడు .పరీక్షిద్దామని వరం కోరినా వాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కున్నాడు .అసలు రూపమే లేదంటాడు .ఇది పరమేశ్వరుడి లీలవిలాసం లీలావిలాసం .
పరమవిశిష్టమైన ,పునీతమైన ఈ భారతదేశంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైనది .అందులోను బదరికావనం అత్యంత పవిత్రమైనది .ఎందుకంటే ఎందరో మునీశ్వరులు ,మహా యోగుల పాదస్పర్సతో పులకించిపోయింది.అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది .ఇటువంటి స్థలంలో మహర్షులు కలసి ఒక గొప్ప యాగాన్ని చేయాలని సంకల్పిస్తారు .మహానుభావులు తలచుకుంటే కాని పని ఉంటుందా?అంతే !తక్షమే యాగానికి కావలసిన సంబరాలన్ని సమకురిపోయాయి .
మనం అనుకున్న సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్దిస్తుంది .ఒక వేళ నిజంగా అంతటి సంకల్పాన్ని నెరవేర్చే శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయానికి అది ఉన్నవాళ్ళ ద్వార సహాయం అంది ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంది .దాన్నే సంకల్పబలం అంటారు .అలా ఈ మహానుభావుల౦తా కలపి యాగం చేయాలని అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతానికి మునుల్లో కేల్ల శ్రేష్ఠుడు అయిన సుత మహాముని అక్కడకు వస్తాడు .
ఈయన రాకే యాగానికి శుభ సంకేతంగా భావిస్తారు రుషులంతా .వేదాల్ని విభజన చేసి ,పంచమవేదమైన మహాభారతాన్ని ,ఉపనిషత్తుల్ని మరెన్నో పుణ్యగ్రంధాల్ని లోకానికి అందంచిన అపర నారాయనుడైన వ్యాసమహర్షి శిష్యుడు ఈ సుతుడు .అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడమే తమ జన్మ పావనమైనదిగా భావిస్తారు మునులంతా .మునీశ్వరులంతా కలసి ఆ సుతమహామునుకి అతిధి సత్కారాలు ,అర్ఘ్యపాద్యాదులను భక్తీ శ్రద్దలతో సమర్పించి పూజిస్తారు. అందుకు ఎంతగానో సంతోషించిన ఆ సుతుడు వారందరిని మన:పూర్వకంగా ఆశీర్వదిస్తాడు .
అనంతరం ఆ ఋషిశ్వరులంతా సుతుడిని పరి పరి విధాలుగా ప్రస్తుంచి నమస్కరించి మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ప్రత్యక్షం కావడంతో మాకెంతో ఆనందానన్ని,ధైర్యాన్ని కూడా ఇస్తోంది .మీ దయవల్లనే మేము ఇంతవరకు అనేక పురాణల్ని విని మా శ్రవణాలను,మనస్సునీ కూడా పునీతం చేసుకున్నాము .ఇదే విధముగా పవిత్రమైన ,మధురమైన మీ వాణితో శివుని గురించి ,ఆయన మహత్యాన్ని గురించి వినాలని అనుకుంటున్నాము .ఈ సమయం కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాము .మా భాగ్యవకాశాన్ని బట్టి ఇప్పటికి మీ రాకతో ఆ శుభ ఘడియలు వచ్చినట్లై౦ది . కాబట్టి మాయందు కనికరించి ఆ కధలను మాకు చెప్పి మమ్ము తరింపచేయడి అంటూ ప్రార్దించారు . కాబట్టి ఆ కైలాసనాధుని కధలు చదివి అయన కరుణాకటాక్షాలను పొందాలని తెలుగువన్ మస్పుర్తిగా కోరుకుంటోంది. చదవండి.... చదివి మీ జన్మ తరింపజేసుకోండి.