శ్రీవారి పచ్చకర్పూర మహత్యాలు ఏమిటి?

 

శ్రీవారి పచ్చకర్పూర మహత్యాలు ఏమిటి?

 

 

 

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజూ పచ్చకర్పూర తిలకాన్ని పూజారులు పెడతారు. భక్తులు వెంకటేశ్వరునికి కానుకలు సమర్పిస్తే దేవాలయ అధికారులు భక్తులకు పచ్చ కర్పూరాన్ని పోస్టు ద్వారా అందజేస్తారు. మరి ఈ పచ్చకర్పూరాన్ని ఎలా వినియోగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
*    స్వామివారి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
*    స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది.
*    స్వామివారి పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది.

 

 

 


*    వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
*      స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అన్నీ వశీకరణ అవుతాయి.
*    స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. 
*    స్వామివారి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.

 

 

 


*       స్వామివారి పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులూ శీఘ్రంగా జరుగుతాయి.
*    స్వామివారి పచ్చకర్పూరం, పాలతో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది.
*        స్వామివారి పచ్చకర్పూరం కలిపిన నీటిని ప్రతిరోజూ తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంతదుర్గంధం దరిచేరవు.
*      స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి.
*   స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.