Read more!

హనుమంతుడు...... ప్రాణదేవుడు

 

హనుమంతుడు...... ప్రాణదేవుడు

ప్రతి ఊరిలో హనుమంతుని గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. పట్టణాలలో అయితే హనుమంతుని దేవాలయాలు చెప్పనక్కర్లేదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే బేధం లేకుండా హనుమంతున్ని పూజిస్తారు. విద్యార్థులు బుద్దిని, శక్తిని ఇవ్వమని కోరుకుంటారు.  ప్రతి ఒక్కరు తమ సద్గుణాలను కూడ గట్టుకొని దేవునికి చేరువలో ఉండాలని మన పూర్వలు మనకు చెప్పారు. దివ్యమైన గుణగణాలతో నిండి ఉన్న వారే దేవుడు. అదే దైవత్వం.

హనుమంతున్ని హిందువులు సాధారణంగా కోతి రూపంలో ఊహించుకున్నారు. బుద్ది బలానికి, దేహ బలానికి నివేచన శక్తికి మరో పేరు హనుమంతుడు ప్రతి రోజు హనుమంతుణ్ణి పూజిస్తే చక్కటి గుణాలు కలుగుతాయని పురాణాలు చెప్పుతున్నాయి. అందుకే హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని వేలాది మంది ఆయన పేరిట దీక్షలను స్వీకరించి హనుమాన్‌ జయంతి రోజు విరమిస్తారు. హనుమంతుడు వాయుదేవుడి కొడుకు అంటే ప్రాణకోటి అంతటికి జీవనాధారమైన శక్తి. అన్నం లేకపోతే బతకవచ్చు, నీళ్లు లేకుండా కొద్ది రోజులు ఉండవచ్చు కాని గాలి లేకుండా క్షణ కాలం కూడా జీవించలేము. వాయువు అంటే ప్రాణశక్తి అందువల్ల వాయువు కొడుకైన హనుమంతుణ్ణి ప్రాణదేవుడు అని పిలుస్తారు. ఆ తరువాత కాలంలో అదే అంశంతో భీముడు, మద్వచార్యులు అవతరించారని మరికొందరు విశ్వాసం.

అనేకమంది ఇష్టదైవంగా పూజించినందుకు దేవుడయ్యాడు. హనుమంతుడు మహయోగి కూడా, దేవుడైన శ్రీ రాముని సేవలో జీవితాన్ని దన్యం చేసుకొని ఆ ఆదేవున్నిభాగ్యాన్ని పొందిన పుణ్యాత్ముడు హనుమంతుడు. దాసులలో అగ్రగన్యుడు, దక్షిణ దేశం కిష్కిందలో పెరిగి పెద్దవాడై లంక నుండి హిమాలయాల వరకు అనేకసార్లు  పరుగెత్తి అయోధ్యలో నెలకొన్న మహభారతీయుడు హనుమంతుడు. మనదేశపు ఐక్యతకు సంకేతంగా నిలిచిన హనుమంతునికి హిమాలయం నుండి రామేశ్వరం వరకు మూలమూలల పూజలు జరుగుతున్నాయి. వాయుదేవుడు, అంజనీ దేవీలకు కలిగిన  సంతానమే ఆంజనేయుడు. పుట్టిన కొంత సేపటికే హనుమంతునికి ఎంతగానో ఆకలేసింది. తలెత్తి చూడగానే ఎదురుగా తూర్పు దిశలో ఎర్రని వస్తువు కనిపించింది. ఎర్రని సూర్యున్ని పండుగా భావించి దాన్ని పట్టుకోవాలని వెళ్ళాడు.

సూర్యుని సెగలు మొకానికి తాకుతు కాలుతున్న పట్టు విడవని హనుమంతుడు పరుగెత్తుతూ చివరికి కనిపించక  కోపంతో ఇంద్రుని మాటలు లెక్క చేయకుండా దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఒక్కసారి దండించాడు. తండ్రి వాయుదేవునికి బాగా కోపం వచ్చి తన కదళికనే ఆపివేశాడు. మూడు లోకల్లో గాలి స్తభించిపోవడంతో దేవతలకు దిక్కు తోచలేదు. దాంతో అందరు దేవతలు వాయు దేవుని వద్దకు చేరి క్షమాపణలు అడిగారు. అక్కడే ఉన్న చిన్ని హనుమంతునికి ఒక్కక్క దేవుడు ఒక్కో వరం ఇచ్చారు. శత్రువుల వల్ల నీకు మృత్యువు రాదు అని బ్రహ్మదేవుడు, నీకు ఇష్టమైనంతా కాలం జీవించి ఉంటావు అని దేవేంద్రుడు వరాలిచ్చారు. వారి వరాలతో అంతటి బలిశాలైన హనుమంతుడు నేటికి అనేక మంది భక్తులకు పూజ్యుడయ్యాడు. శ్రీ రాముడు, సీతలకు ఆప్తబంధువుడైయ్యాడు. హనుమంతుడు ప్రతి విషయంలోనూ వారికి దూతగా నిలిచాడు. సుగ్రీవుడి అన్న వాళి ఒక రాక్షసునిపై యుద్దం చేస్తూ గృహల్లోకి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు.