మొగ్గ దోసిళ్ళ నోము (Mogga Dosilla Nomu)
మొగ్గ దోసిళ్ళ నోము
(Mogga Dosilla Nomu)
కథ
ఒక బ్రాహ్మణ బాలిక సవతి పోరునూ, దరిద్రాన్నీ భరించలేక... ప్రతిరోjజూ శివలింగం ముందు దు:ఖిస్తుండగా, ఒకనాడు శివదేవుడు ప్రత్యక్షమై "అమ్మాయి! గతంలో నువ్వు మొగ్గ దోసిళ్ళ నోము నోచి ఉల్లంఘించడం వల్లనే నీకీ కష్టం వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆ నోమును యాధాప్రకారం ఆచేరిస్తే, సవతి తల్లి పోరూ తప్పుతుంది. సర్వ దరిద్రాలూ తొలిగిపోతాయి ” అని చెప్పాడు.
అది విన్న బాలిక ఆ విధంగానే చేయగా ఏడాది గడిచేసరికి సవతి తల్లికి మనసు మారి, ఆ కన్యను ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. అంతలోనే సంపన్నుల యింటి సంబంధం వచ్చి, ఆమెకు ధవంతుడైన యువకునితో వివాహం జరిగి దరిద్రమూ తొలగిపోయింది.
విధానం
ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఒక పళ్ళెంలో పసుపు పోసి, దానిమీద మూడు దోసిళ్ళ నీరు పోసి, దానిని వంటికి రాసుకుని శివుణ్ణి స్మరించాలి. పై కథ చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఏడాది తరువాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపనం
మూడు దోసిళ్ళ పువ్వులూ, మూడు దోసిళ్ళ పగడాలు, మూడు దోసేళ్ళముత్యాలూ తీసుకుని శివాలయానికి వెళ్లి , శివుడికి వాటిని ధారబోసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి.