మార్గ శిరమాస లక్ష్మి పూజ విధానం

 

మార్గ శిరమాస లక్ష్మి పూజ విధానం...!

 

మార్గశిర మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం. ‘మాసాలలో నేను మార్గశిరను’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కూడా. అందుకే.. ఆ మాతసంలో  లక్షీదేవి వ్రతం శుభదాయకం. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నియమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తే.. సకలైశ్వర్యాలూ సిద్ధాయనేది ఆర్యోక్తి. అమ్మకు సరైన ఆసనాన్ని అమర్చి.. ఆచమనం చేసి.. తొలుత పసుపుముద్దతో గణేశుడ్ని చేసుకొని పూజించాలి.

ఆ తర్వాత అమ్మకు శోడశోపచారాలు చేయాలి. నెలలో అయిదు గురువారాలొస్తే అయిదు గురువారాలు లక్ష్మీదేవికి అయిదు రకాల నైవేద్యాలు సమర్పించాలి. వ్రతం చేస్తున్నన్ని రోజులూ.. ఇంట్లో చిరిగిన బట్టలు ఎవరూ వేసుకోరాదు. మగవారు తోబుట్టువలను కష్టపెట్టకూడదు. ఇల్లాలి కంట కన్నీరు రానీయకూడదు. వ్రతం జరుగున్నన్నినాళ్లూ ఇంట్లో వారందరూ కళకళలాడుతూ ఉండాలి. ఈ వ్రత విధానానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని క్లిక్ చేయండి....