నవంబర్ 30న కృష్ణుడ్ని పూజిస్తే విజయం తథ్యం

 

నవంబర్ 30న కృష్ణుడ్ని పూజిస్తే విజయం తథ్యం!

 

‘మాసాల్లో నేను మార్గశిరను’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అర్జునుడికి ఆయన భగవద్గీత భోధించింది కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడే కావడం విశేషం. భగవద్గీత కేవలం యుద్ధానికి మాత్రమే పరిమితమైంది కాదు. రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకూ గీతలో పరిష్కారం లభిస్తుంది. అందుకే... హిందూ ధర్మం మానవాళికి అందించిన గొప్ప బహుమతిగా ‘భగవద్గీత‘ను పేర్కొంటారు. గీతను పరమాత్మ బోధించిన మార్గశిర శుద్ధ ఏకాదశి... ఈ సారి ‘నవంబర్ 30’న వచ్చింది. ఆ రోజు శ్రీమహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు కావడం గమనార్హం. అందుకే...ఆ రోజు ఆయన మనకందించిన భగవద్గీతను గుర్తు చేసుకోవాలి. కుదిరితే.. అందులోని ఏదొందల శ్లోకాలను పారాయణం చేయాలి. కుదరని పక్షాన... కనీసం 11వ అధ్యాయాన్నయినా పరాయణం చేయాలి. అర్జునుడికి పరమాత్మ విశ్వరూప సందర్శనాన్ని ప్రసాదించింది ఆ అధ్యాయంలోనే. అది కూడా కుదరకపోతే.. కనీసం భగవద్గీతను వినడానికైనా ప్రయత్నం చేయాలి. భగవద్గీత గ్రంధాలను పంచితే కూడా చాలా మంచింది. ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండి.. రాత్రికి జాగరణ చేస్తే... ఆ బ్రహ్మండనాయకుని కృపా కటాక్షాలు మీ వెంటే ఉంటాయ్. నవంబర్ 30 కొన్ని గంటల్లో రాబోతోంది. మరచిపోవొద్దు. తప్పక.. ఆ రోజున గీతా పారాయణం చేయండి. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే.. ఇక్కడున్న లింక్ ని ఒకసారి క్లిక్ చేయండి.