మాట ఎలా ఉండాలి

 

మాట ఎలా ఉండాలి

 

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన: (మనుస్మృతి)

ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పాలి. ఆ సత్యాన్ని కూడా అవతలివారు మనసు నొచ్చుకోకుండా చెప్పాలి. అయితే సత్యమైనా సరే... అవతలివాడు బాధపడతాడనుకుంటే, దానిని చెప్పకపోవడమే మేలు. అలాగని వినడానికి బాగుంటుంది కదా అని అసత్యాన్ని కూడా చెప్పకూడదు. ఏతావాతా తేలిందేమిటంటే సత్యాన్ని చెప్పాలి, అది అవతలివాడికి ప్రియంగా ఉండేలా చెప్పాలి. అసత్యాన్ని చెప్పకూడదు, అది అవతలివాడికి ప్రియాన్ని కలిగిస్తుందనిపించినా కూడా చెప్పకూడదు. ఇలా ఒక్క చిన్న శ్లోకంలో ఇటు నీతినీ అటు లౌక్యాన్నీ కలగలిపి చెప్పేశాడు మనువు!

 

-నిర్జర