నీడలాంటి స్నేహితుడు

 

 

 

నీడలాంటి స్నేహితుడు

 

 

ఆరంభగుర్వీ క్షయిణీ క్రమేణ

లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్‌।

దినస్య పూర్వార్థ పరార్ధభిన్నా

ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానామ్‌॥

దుర్మార్గుల స్నేహం ప్రాతఃకాలపు నీడలాగా మొదటి పెద్దదిగా ఉండి క్రమేపీ క్షీణించిపోతుంది. కానీ సజ్జనులతో స్నేహం అలా కాదు. మొదట సాయంకాలపు నీడలాగా చిన్నగా ఉన్నా క్రమేపీ వృద్ధి చెందుతుంది. ఎందుకంటే దుర్మార్గులు చేసే స్నేహం అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కాబట్టి అందులో విపరీతమైన మార్పులు రాక తప్పదు. కానీ మంచివారు చేసే స్నేహం మనసుతో ముడిపడి ఉంటుంది. అందుకే కాలం గడిచేకొద్దీ అది మరింత దృఢపడుతుంది.

 

..Nirjara