విద్య ఏమేం చేస్తుందంటే!
విద్య ఏమేం చేస్తుందంటే!
మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాన్తేవ చాభిరమయత్యపనీయ ఖేదం.
లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం
కిం కిం న సాధయతి కల్పలతేవ విద్యా?
విద్య తల్లిలా రక్షిస్తుంది. తండ్రిలాగా మంచిచెడుల విచక్షణను అలవరుస్తుంది. భార్యలాగా బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. సర్వసంపదలను ప్రసాదిస్తుంది. దశదిశలా కీర్తిని వ్యాపింపచేస్తుంది. ఇలాంటి విద్యతో సాధించలేనిది ఏముంది?
-నిర్జర