శ్రావణ శుక్రవారం అమ్మవారి కి చీరకట్టే విధానం
శ్రావణ శుక్రవారం అమ్మవారి కి చీరకట్టే విధానం
శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిదురలేచి, అభ్యంగన స్నానమాచరిస్తారు. ఇంటి గడపలకు పసుపు, కుంకుమలను అద్దుతారు. అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి... పాయసం, చక్కెరపొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు. వీటితోపాటు పూర్ణంబూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిదంటారు పెద్దలు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తయిదువను ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావించి, భోజనాది సత్కారాలతో సేవించి, తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తయిదువలను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకు, వక్క, అరటిపండులతో కూడిన తాంబూలాన్ని అందించి... తమకి ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు. అయితే రెండో వారం ఏదన్నా అవాంతరం వస్తుందనుకునే వారు అప్పటివరకూ వేచి ఉండకుండా తొలి శుక్రవారంలోనే ఈ వ్రతాన్నీ ఆచరిస్తారు. వరాలని ఒసగేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారమే వరలక్ష్మిదే కదా! ఇంకా మీకు మరిన్ని విషాలు తెలియాలంటే భావన గారి మాటల్లో వినండి..... https://www.youtube.com/watch?v=5_06aVX-pl4