మాఘ గుప్త  నవరాత్రులు చేయలేకపోయారా...కనీసం చివరి రోజు అయినా ఈ పనులు చేయండి..!

 

మాఘ గుప్త  నవరాత్రులు చేయలేకపోయారా...కనీసం చివరి రోజు అయినా ఈ పనులు చేయండి..!

 


మాఘ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులను మాఘ గుప్త నవరాత్రుల పేరిట జరుపుకుంటారు. ఇదే తొమ్మిది రోజులను శ్యామలా నవరాత్రుల పేరిట కూడా జపుకుంటారు.  ఈ శ్యామలా నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు శ్యామలా దేవిని ప్రతిష్టించి శరన్నవరాత్రుల దీక్ష లాగా తీసుకుంటారు. లేదంటే మరికొందరు శరన్నవరాత్రులలో అమ్మవారు రోజుకు ఒక అవతారంలో రోజుకొక అలంకారంలో ఎలా దర్శనం ఇస్తుందో అలా కూడా చేసుకుంటారు.  ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోలేకపోయిన వారు కనీసం చివరి రోజు అయిన నవమి రోజు అయినా కొన్ని పనులు చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.  ఫిబ్రవరి 7వ తేదీతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. వివిధ రకాల సమస్యలు ఉన్నవారు ఈ నవరాత్రులలో చివరి రోజు అయిన 7వ తేదీ ఈ కింద చెప్పుకున్న పనులు చేయాలి.

ప్రతికూల శక్తి..

ఇంట్లో ప్రతికూల శక్తి  ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  కుటుంబ సభ్యుల మధ్య గొడవలు,  ఆర్థిక సమస్యలు,  ఒక దాని తరువాత మరొక సమస్య రావడం, భార్యాభర్తల మధ్య కలహాలు ఇలాంటివన్నీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి వలనే వస్తాయి.  అయితే దీన్ని తొలగించాలంటే.. ఇంట్లో అమ్మవారిని పూజించిన తరువాత 11 లవంగాలను అమ్మవారి ముందు ఉంచాలట.  ఆ తరువాత ఒక ప్రమిద తీసుకుని అందులో కర్పూరం వేసి వెలిగించాలి.  ఆ మండుతున్న కర్పూరంలో ఈ లవంగాలు వేయాలి. ఈ పొగను ఇల్లంతా సాంబ్రాణి ధూపంలా తిప్పాలి.  ఇలా చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని,  ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే పోతాయని అంటారు.

ఆర్థికంగా బాగుండాలంటే..

ఆర్థిక ఇబ్బందులు మనుషులను ప్రశాంతంగా ఉండనీయవు.  కొందరు ఎంత సంపాదించినా ధనం నిలవకుండా ఉంటుంది. మరికొందరికి అసలు ధన సంపాదనకు అవకాశాలు కూడా దొరకవు. అయితే తమలపాకు పై కుంకుమ పువ్వుతో "శ్రీ" అని రాసి ఆ తమలపాకును  అమ్మవారి పాదాల వద్ద ఉంచాలి.  కొంత సమయం తర్వాత ఆ ఆకును ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో భద్రంగా  ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందట.

సంతోషం కోసం..

గుప్త నవరాత్రుల చివరి రోజు 9 మంది ఆడ పిల్లలను ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలట. పూజలో  అమ్మవారికి సమర్పించిన పువ్వులను తెల్లటి వస్త్రంలోో చుట్టి ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలట.  ఇలా చేస్తే ఆ ఇంట్లో సంతోషం ,  శ్రేయస్సు కొనసాగుతాయట.

వైవాహిక జీవితంలో ప్రేమ..

వైవాహిక జీవితం ఇద్దరు వ్యక్తులకు చాలా ముఖ్యమైనది. కానీ చాలా వరకు భర్త ప్రవర్తన సరిగా లేక లేదా భార్య ప్రవర్తన సరిగా లేక భార్యాభర్తలు ఇద్దరూ ఇబ్బందులు అనుభవిస్తుంటారు. ఇలాంటి సమస్యలు తొలగి భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే గుప్త నవరాత్రుల చివరి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.  ఆ తరువాత అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.  అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.  ఇద్దరూ కలిసి ప్రసాదం తినాలి. ఇలా చేస్తే ఇద్దరి జీవితం చాలా బాగుంటుంది.  ఇద్దరి  మధ్య అన్యోన్యత పెరుగుతుంది.


                                        *రూపశ్రీ.