మాఘపూర్ణిమ రోజు ఈ పనులు చేస్తే.. పితృ దేవతలు సంతోషిస్తారు..!

 

 

మాఘపూర్ణిమ రోజు ఈ పనులు చేస్తే.. పితృ దేవతలు సంతోషిస్తారు..!


పితృదేవతలకు హిందూ ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది. మరణించిన వారిని, మరణించిన పెద్దలను పితృదేవతలు అంటారు. సాధారణంగా పితృ దేవతలను తృప్తి పరచడానికి అమావాస్య రోజు తర్పణం ఇవ్వడం,  ఏడాదికి ఒకసారి ఆబ్దికం పెట్టడం వంటివి చేస్తారు.  అయితే మాఘపూర్ణిమ రోజు కింద చెప్పుకున్న విధంగా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారట.  సాధారణంగా పితృదేవతలు అసంతృప్తిగా ఉంటే ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య జరగడం,  ఏదో ఒక ఇబ్బంది ఎదురు కావడం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు.. ప్రశాంతత లేకపోవడం,  ఎంత సంపాదించినా ఆర్థిక లోటు కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతూ  ఉంటాయి.  అందుకే పితృ దేవతలు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి.  ఇందుకోసం పూర్ణిమ రోజు ఈ కింద చెప్పుకున్నట్టు చేయాలి.


మహా కుంభమేళా కారణంగా ఈ సారి  మాఘి పూర్ణిమ ప్రాముఖ్యత చాలా రెట్లు పెరిగింది. మాఘ పూర్ణిమ శుభ సందర్భంగా, మహాకుంభంలో పవిత్ర స్నానం చేస్తుంటారు. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం మాఘ పూర్ణిమ తేదీన ఆశ్లేష నక్షత్రం కూడా ఏర్పడుతోంది. ఇది రాత్రి 7:35 వరకు ఉంటుంది. ఈ సమయంలో సౌభాగ్య యోగం కూడా యాదృచ్చికంగా సంభవిస్తుంది. ఇది రాత్రి 8:06 గంటల వరకు ఉంటుంది. ఈ యోగం ఉన్న సమయంలో  'పిత్ర సూక్తం' పారాయణ చేయాలట.


మాఘ పూర్ణిమ రోజు ఇలా పిత్ర సూక్తం పారాయణ చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే పితృ దేవతలను తలచుకుంటూ మాఘ పూర్ణిమ రోజు దానం చేయడం వల్ల వారు సంతృప్తి పడతారు.  పేదవారికి, నిస్సహాయులకు నిత్యావసరాలు, దుప్పటి, దుస్తులు వంటివి దానం చేయాలి.  పూర్ణిమకు చంద్రునికి గొప్ప సంబంధం ఉంది. ఈ రోజు తెలుపు పస్తువులు ఏవైనా దానం చేస్తే చంద్రుడు  అనుకూలంగా మారతాడు.


                                        *రూపశ్రీ.