మాఘ గుప్త నవరాత్రులలో వీటిని దానం చేస్తే ఆనందం మీ వెంటే..!

 

మాఘ గుప్త నవరాత్రులలో వీటిని దానం చేస్తే ఆనందం మీ వెంటే..!

 

 

దానం.. హిందూ ధర్మంలోనే కాకుండా చాలా మతాలు దానాన్ని ప్రోత్సహిస్తాయి.  దానం చేయడం అంటే ఇంకొక మనిషి అవసరాలను తీర్చడమే..  ఎంత సంపాదించుకున్నా పరులకు కొంచెమైనా దానం చేయకపోతే అలాంటి వారి జీవితంలో ఇబ్బందులూ.. సమస్యలు వస్తూనే  ఉంటాయట. ఇబ్బందులలోనూ,  సమస్యలలోనూ ఉన్నవారికి దానం చేయడం వల్ల పుణ్యం కూడా లభిస్తుంది. పాప కర్మలు కరుగుతూ ఉంటాయి.  మాఘ మాసంలో ఎంతో నిష్టగా చేసుకునే మాఘ గుప్త నవరాత్రుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మాఘ గుప్త నవరాత్రులనే శ్యామలా నవరాత్రులు అనికూడా అంటారు.  ఈ నవరాత్రులలో కొన్ని దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందట.  

మాఘ గుప్త నవరాత్రులు జనవరి 30 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 7 వరకు కొనసాగుతాయి. ఈ నవరాత్రులలో ఏవి  దానం చేయడం శుభప్రదమూ తెలుసుకుంటే దానికి తగినట్టు ఆయా వస్తువులు దానం చేసి  జీవితంలో సంతోషాన్ని నింపుకోవచ్చు.

ఇవి దానం చేయాలి..

అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి,  ఇంట్లో శ్రేయస్సును కొనసాగాలి అంటే.. గోధుమలు, బియ్యం, బార్లీ మొదలైన ధాన్యాలను  దానం చేయడం మంచిది. ఇది బ్రాహ్మణునికి, లేదా పేదవాడికి, అవసరమైన వారికి  ఇవ్వాలి. ధాన్యాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సంపదలు పెరుగుతాయి.

ఎరుపు, పసుపు లేదా తెలుపు బట్టలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. వీటిని దానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అదనంగా ఆర్థిక స్థితిని బట్టి  చిన్న బంగారు లేదా 

నువ్వులు,  బెల్లానికి మాఘమాసంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూలు లేదా నువ్వులు, బెల్లంతో చేసిన తీపి పదార్థాలు దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ దానం జీవితంలో ఆనందం, శాంతి,  సానుకూల శక్తిని తెస్తుంది.

అమ్మవారి పూజా సామగ్రిలో చందనం,  కుంకుమానికి ప్రత్యేక స్థానం ఉంది. వీటిని దానం చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి కలుగుతుంది.  అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది.

పై వస్తువులు ఏవైనా దానం చేసేటప్పుడు అమ్మవారిని మనసులో మనస్ఫూర్తిగా ధ్యానించాలి.  మనసులో ఎలాంటి బాధ, కల్మషం, దిగులు లేకుండా ఎంతో సంతోషంగా దానం చేయాలి. ఇలా చేస్తేనే దానం చేసిన ఫలితం లభిస్తుంది.  


                                 *రూపశ్రీ.