Read more!

నారాయణ పాదములు- హాతిరాంజీ మఠo గురించి మీకు తెలుసా?

 

నారాయణ పాదములు- హాతిరాంజీ మఠo

 

గురించి మీకు తెలుసా?

 

 

 

 

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో 'నారాయణ పాదం' ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీపాద పూజ, ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి.  శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు రెండు 'భూచక్ర' గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను, బంగారు బావితీర్థాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు.

 

 

 

 


ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారుబావి జలంతో అభిషేకం చేసి, హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు. ఆఫై ప్రసాద వినియోగం, వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు. ఇవేగాక అభిదేయక అభిషేకం(జూన్ నెలలో) పద్మావతి పరిణయ వైభవం (వైశాఖా శుద్ద దశమి) గోదా పరిణయ ఉత్సవం (పుష్య మాసం) అనే కొత్త ఉత్సవాలు తిరుమలలో జరుగుతున్నాయి

హాతిరాంజీ మఠo

 

 

 

 


ఆలయానికి ఆగ్నేయంలో ఉన్న మఠానికి `హతిరాంజి మఠo' అనే పేరు. ఈ మఠo సుమారు 500 సంవత్సవరాలనుండి తిరుమలలో ప్రసిద్ది పొందిన మఠo తిరుపతిలో కూడా `మహంత్ మఠo' ఉంది. ఈ 'మఠo'ను స్థాపించినవాడు `హతిరాంజీ`. ఇతనినే బావాజీ అని అంటారు. రామానుజాచార్య సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం ఈ మఠo లక్ష్యం. తిరుమల నిర్జనవాసంగా ఉన్నవేళ ఆంగ్లేయుల నుండి తిరుమల ఆలయ పరిపాలను చేపట్టి ఆలయ సాంప్రదాయాలను విచ్చిన్నం చేయకుండా కాపాడుతూ 'విచారణ కర్తలు'గా వ్యవహరించినవారు మహంతులు.

 

 

 

 

వారిలో  సేవాదాస్, ధర్మదాస్, భగవాన్ దాస్, మహాభీర దాస్, రామకృష్ణ దాస్, ప్రయోగదాసులు చాల ప్రసిద్దులు. ఈ మఠoలో పంచముఖ ఆంజనేయులు, ఫూలడోలు, శ్రీరామనవమి డోలత్సవం ప్రదేశాలు చూడదగ్గవి. దశావతర చిత్రాలు దర్శించ దగ్గవి. ఈ దేవాలయంలో పెద్ద పెద్ద సాలగ్రామాలు ఉన్నాయి. 'హతి' అంటే ఏనుగు. బహుశా భైరాగి పేరు రాం కావచ్చు. ఏనుగంత మనిషికావడం వల్ల  హతిరాoగా వ్యవహరింపబడి ఉండవచ్చు. లేదా శ్రీవారు ఏనుగు రూపంలో 'రాం'కు దర్సనమివ్వడం వల్ల 'హత్తిరాం' అయి ఉండవచ్చు. హతిరాంజీ కథలు కోకొల్లలు.

 

 

 

 


ఉత్తరదేశం నుండి తిరుమల చేరుకొన్నవాడు 'రామ్' అతని తపస్సు స్వామి చాలాసార్లు పరీక్షించాడు. బోయగా, చెంచుగా, కిరాతుడుగా, పులిగా, నక్కగా, కుక్కగా, వేషాలు వేసి శ్రద్ధగా పరీక్షించేవాడు. చివరకు 'రాంజీ' విసుగుతో కొండ దిగుతుంటే బ్రాహ్మణుని రూపంలో వెన్నంటి వచ్చి కొండవదలి పోవద్దని సలహా ఇచ్చాడు. అయినా 'రాంజీ' కదిలి పోతుంటే 'అవ్వచారి' కోన దగ్గర సాక్షాత్కారించాడు. ఒకప్పుడు చంద్రగిరి దేవారాయలు 'హతిరాంజీ' ని ఏనుగుల బలం చూపమని పరిహాసం చేశాడట. రాత్రికి రాత్రి బండ్ల కొలది చెరుకులను తిని మాముల మనిషిగా బయటకు వచ్చాడట. కానీ స్వామివారే ఏనుగురూపంలో వచ్చి హతిరాంజీని కాపాడాడని భక్తులు చెబుతారు. హతిరాంజీ అడవిలో దొరికే ఓ రకమైన 'ఆకును' తినేవారు. ఈ ఆకును తింటే ఆకలి ఉండదు.ఇప్పటికీ తిరుమలలో ఈ ఆకు మఠoలో దొరుకుతుంది.