కొన్ని సందర్భాలలో మాట్లాడటం ఎంత నష్టం కలిగిస్తుందో..!
కొన్ని సందర్భాలలో మాట్లాడటం ఎంత నష్టం కలిగిస్తుందో..!
మాట్లాడటం అందరూ సహజంగా చేసే పని. అయితే కొన్ని సందర్భాలలో మాట్లాడటం అస్సలు మంచిది కాదట. సాధారణంగా ఏ సందర్భంలో అయినా మాట్లాడటం మనిషి బలహీనతగా పరిగణిస్తారు. కొన్ని సందర్బాలలో అస్సలు మాట్లాడకుండా ఉండలేరు కూడా. కానీ రోజువారీ చేసే కొన్ని పనుల సమయంలో మాట్లాడటం వల్ల చాలా పెద్ద నష్టాలే ఉన్నాయని అంటున్నారు. వీటి గురించి తెలుసుకుంటే..
స్నానం చేసేటప్పుడు..
స్నానం చేసేటప్పుడు చాలామందిలో బాత్రూమ్ సింగర్స్ బయటకు వస్తుంటారు. మరికొందరు ఫోన్ ను లౌడ్ స్పీకర్ ఆన్ చేసి చివరికి స్నానం చేసేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే స్నానం చేసేటప్పుడు పాటలు పాడటం, మాట్లాడటం వంటివి చేయకూడదు అంట. ఇలా చేస్తే వరుణ దేవుడు ఆ వ్యక్తి అందాన్ని అపహరిస్తాడని చెబుతారు.
హోమం, జపం..
హోమాలు చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరూ మాట్లాడకూడదు. నిజానికి హోమాలు చేస్తున్నప్పుడు పండితులు మాత్రమే మంత్రాలు, శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. కానీ హోమం, జపం చేసేటప్పుడు మాట్లాడితే అగ్ని దేవుడికి కోపం వస్తుందట. అంతేకాదు.. హోమం చేస్తున్నవారి సంపదను అగ్నిదేవుడు అపహరిస్తాడు అంట. అందుకే హోమాలు, జపాలు చేసేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు.
భోజనం..
భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటి తరం వారికి భోజనం చేస్తున్నప్పుడు లొడలొడ మాట్లాడటం అలవాటు. కానీ భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడటం చేస్తే మృత్యు దేవుడు ఆయుష్షును అపహరిస్తాడని చెబుతారు.
పై విషయాల ప్రకారం.. స్నానం చేస్తున్నప్పుడు, హోమం జపం వంటివి చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు.. మాట్లాడకూడదని, మౌనం పాటించాలని సాక్షాత్తు ఆ వ్యాస మహర్షుల వారే తెలిపారు.
*రూపశ్రీ.