శిలారూపమును ధరించిన శ్రీనివాసుడు

 

శిలారూపమును  ధరించిన శ్రీనివాసుడు

కొల్హాపురంలో లక్ష్మీదేవి  తన భర్త శ్రీహరిని ధ్యానిస్తూ ఉంది.  నారదుడు  లక్ష్మీదేవి దగ్గరికి వచ్చాడు. "లక్ష్మీదేవి ఎలా ఉన్నావు నారదా అని అడిగి నా భర్త మళ్ళీ కష్టాలు పాలవుతాడా" అని నారదుడిని అడిగింది. నారదుడు ఏమని చెప్పను  తల్లీ నీ భర్త పరంధాముడు నీకు తెలియకుండగా పద్మావతిని పెళ్లి చేసుకొని శేషాద్రిలో ఆనందముగా  ఉన్నాడు. లక్ష్మీదేవి మనస్సు ఉండలేక నారదా నేను ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడా అని కోపముతో శేషాచలమునకు వచ్చింది.

శేషాద్రిలో శ్రీనివాసుడు పద్మావతిని వెంటబెట్టుకొని కొండలు, నదులు, నందనవనము, మృగాలను మరియు వింత వింత పుష్పములను, జలపాతములను చూసి ఆనందంతో ఇంటికి వచ్చారు. లక్ష్మీదేవి శేషాచలమునకు వచ్చి, వారి  ఆనందము చూసి కోపముతో అగ్నిసాక్షిగా పెండ్లాడిన నా భర్తను, నీ భర్త  అంటావా అని చాలా రకాలగా గొడవపడి  శ్రీనివాసుడిని ఇరువురు ఒత్తిడి చేసారు. వీరిద్దరి గొడవ చూడలేక శ్రీనివాసుడు ఏడుఅడుగులు వెనుకకు వేసి పెద్ద ధ్వని చేసి శిలగా మారిపోయాడు. లక్ష్మీ, పద్మావతి శబ్దమునకు వెనుకకు తిరిగి చూస్తే శిలారూపము కనిపించింది. శిలగామారిన శ్రీనివాసునుని చూసి లక్ష్మీ పద్మావతులు ఇరు ప్రక్కలా నిలబడి దుఃఖించారు.

లక్ష్మీదేవి, పద్మావతులకు శ్రీనివాసుని ఆదేశం
శిలగా మారిన శ్రీనివాసుడు పద్మావతి, లక్ష్మీదేవిని చూసి ఇలా అన్నాడు. "లక్ష్మీ నీ అంశములో పుట్టినదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగంలో రామావతారము దాల్చినప్పుడు రావణుని చేతిలో సీతాదేవి రూపములో అష్టకష్టములు అనుభవించిన వేదవతియే ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. అగ్నిదేవుడు, వేదవతిని నాకు చూపించి ధర్మపత్నిగా స్వీకరించమని కోరగా నీవు సమ్మతించితివి. నేను రామావతారములో ఏకపత్నీవ్రతుడను కావున కలియుగమున అవతరించి స్వీకరిస్తాను అని అభయమిచ్చాను. ఆ వేదవతియే ఈ పద్మావతిగా  జన్మించి నన్ను మళ్లీ పెళ్ళి చేసుకుంది.