ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం
ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారం
ఇది ముప్పై రెండు చేతులతో ముప్పై ఆయుధాలు కలిగిన విరాడ్రూపం. సోమదత్తుడు ద్వాత్రింశద్భుజ స్వామిని ఉపాసించి పూర్వం పోయిన రాజ్యాన్ని సోమదత్త మహారాజా మరలా పొందినట్లు పురాణం.
సోమదత్త మహారాజా
ద్వాత్రింశద్భుజ మారుతే: |
రాజ్య భ్రష్ఠగ తాశంకో
భూయో రాజ్య మవాపహ ||
అనే శ్లోకం వలన తెలుస్తుంది. పరాశరసంహితలో 4, 5 పటాల్లో సోమదత్తుని చరిత్ర వలన ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి అనుగ్రహం వ్యక్తమవుతుంది. ఇది మహిష్మతీపుర హనుమత్పీఠ కాహ్రిత్ర. ఆ అవతారమూర్తి రూపధ్యానం ఇలా చెప్పబడింది.
ఖడ్గం ఖట్వాంగశైలద్రుమ పరశు గదాపుస్తకం శంఖచక్రే
పాశం పద్మం త్రిశూలం హల ముసల ఘటాన్ టంకశ క్త్యక్ష మాలాః |
దండం వా కుంత చర్మా చలిత కుశవరా పట్టిసం చాపబాణాన్
ఖేటం ముష్టిం ఫలం వా డమరు మభిభజే బిభ్రతం వాయుసూనుమ్ ||
ఈ శ్లోకం ద్వారా తెలిసిన మూర్తే సోమదత్తునికి సాక్షాత్కరించాడు. ఆయనకు గల ముప్పై రెండు ఆయుధాలు పై శ్లోకంలో చెప్పబడ్డాయి. ఈ ద్వాత్రింశద్భుజ ఆంజనేయుని ఉపాసనామంత్రం హుంకార హనున్మంత్రం. ఈ మంత్రం ఉపాసింపబడే స్వామి మూడు శిరస్సులు కలిగి వర్ణింపబడటం విశేషం. సోమదత్తున్ని అనుగ్రహించిన ద్వాత్రింశద్భుజుడు హనుమద్వ్రతం వలన సంతుష్టుడై సాక్షాత్కరించిన ప్రసన్నమూర్తి కాగా పద్మకల్ప దేవదానవ యుద్ధంలో సాక్షాత్కరించిన మూర్తి రూపధ్యానం.