Read more!

నాయకునికి ఉండవలసిన ఆరు లక్షణాలు

 

 

నాయకునికి ఉండవలసిన ఆరు లక్షణాలు

 

ఆజ్ఞా కీర్తిః పాలనం బ్రాహ్మణానాం

దానం భోగో మిత్త్రసంరక్షణం చ ।

యేషామేతే షడ్గుణా న ప్రవృత్తాః

కో-ర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ ॥

ఆజ్ఞని నెరవేర్చే సామర్థ్యం, కీర్తి కలిగి ఉండటం, శాస్త్రకోవిదులను రక్షించడం, దానం చేయడం, అనుభవం కలిగి ఉండటం, మిత్రులను సంరక్షించడం అనే ఆరు గుణాలు రాజుకి ఉండి తీరాలి. అలాంటి సద్గుణాలు ఏ రాజుకి ఉండవో... అలాంటి రాజుని ఆశ్రయించి ఎలాంటి ఉపయోగమూ లేదు!