Read more!

డబ్బుంటే అన్ని గుణాలూ ఉన్నట్లే!

 

 

డబ్బుంటే అన్ని గుణాలూ ఉన్నట్లే!

 

 

యస్యాస్తి విత్తం స నరః కులీనః

స పండితః స శ్రుతవాన్గుణజ్ఞః ।

స ఏవ వక్తా స చ దర్శనీయః

సర్వే గుణాః కాంచనమాశ్రయంతి ॥

డబ్బున్న మనిషిని ఈ లోకం ఎలా చూస్తుందో శతకకారుడు ఈ పద్యం ద్వారా పేర్కొంటున్నాడు. డబ్బున్నవాడిని గొప్ప కులంలో పుట్టినవానిగా భావిస్తారు; అన్నీ తెలిసిన పండితునిగా అతడిని గౌరవిస్తారు; గొప్ప వక్తగా తలచి అతని మాటలను శ్రద్ధతో ఆలకిస్తారు; తప్పక దర్శించుకోదగిన మహనీయునిగా కొలుస్తారు. అదీఇదీ ఎందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే సర్వగుణాలన్నీ డబ్బునే ఆశ్రయించి ఉంటాయి.