కుబేరుడు - ఈశ్వరుడు

 

కుబేరుడు - ఈశ్వరుడు

 

 

అకృతత్యాగమహిమ్నా మిథ్యా కిం రాజరాజశబ్దేన।

గోప్తారం న నిధీనాం కథయంతి మహేశ్వరం విబుధాః॥

ఈ లోకంలో అందరికంటే ధనవంతుడు కుబేరుడే కదా. అందుకనే కుబేరుడికి రాజరాజు అన్న బిరుదు ఉంది. కానీ ఏం ఉపయోగం! ఆయన ఏనాడు ఎవ్వరికీ దానం చేసి ఎరుగడు. కానీ పరమేశ్వరుని సంగతి అలా కాదు! బూడిద రాసుకుని జంతుచర్మాన్ని కప్పుకొన్నా కూడా కోరిన వాంఛలను తీర్చేవాడు. అందుకనే ఆయనను పండితులంతా మహేశ్వరుడు అని పిలుస్తారు.