Read more!

Kubera

 

ధనాధిపతి కుబేరుడు

Kubera

 

దిక్పాలకులలో కుబేరుడు ఒకడు. ఉత్తర దిక్కుకు, సమస్త సంపదలకు అధిపతి కుబేరుడు. విశ్రవోబ్రహ్మకు కుమారుడితడు. ఇతని తల్లి ఇలబిల. ఇతని సవతి తమ్ముడు రావణుడు. బ్రహ్మ గురించి తపస్సు చేసిన కుబేరుడు ధనాధిపత్యం, లంక అనే నగరం, నలకూబరుడనే కుమారుడిని వరంగా పొందుతాడు. ఒకసారి అతను తన పుష్పక విమానంలో సంచరిస్తుండగా అది చూసిన రావణుని తల్లి కైకెసి, ఆ విమానము తీసుకురమ్మని ఆదేశిస్తుంది. అప్పుడు రావణుడు ముందు శివుని గురించి తపస్సు చేసి, ఆయనను మెప్పించి అనేక వరాలు పొందుతాడు. తర్వాత కుబేరుడి వద్ద నుంచి లంక నగరాన్ని, పుష్పక విమానాన్ని పొందుతాడు. నలకూబరుడు కాక మణిగ్రీవుడనే మరో కుమారుడు కుబేరుడికి ఉన్నాడు. వేంకటేశ్వరునికి వివాహ సమయంలో ధనాన్ని అప్పుగా ఇచ్చింది కుబేరుడే.