క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం
క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం
క్షీరాబ్ది ద్వాదశి.. కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. దేవదానవులు క్షీరసాగరాని మదిచిన రోజు కాబట్టి... ఈ రోజుని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అని పిలుస్తారు. ఈ రోజంటే శ్రీమహావిష్ణువుకి ప్రీతి. అందుకే.. లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగుపెడతాడు. బృందావనం అంటే తులసి. తులసి అంటే.. లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ.. శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే.. తగిన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వరాలు ప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తున్నాయ్. ఈ క్షీరాబ్ది ద్వాదశికి వ్రతానికి చెందిన పూర్తి నియమ నిబంధలు, వ్రత విధానం తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.