కార్తీక పౌర్ణమినాడు 365 వత్తుల దీపాలు వెలిగించే పద్ధతి
కార్తీక పౌర్ణమినాడు 365 వత్తుల దీపాలు వెలిగించే పద్ధతి
దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే... నిత్యం ధూపు, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో.. ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రధం. కానీ.. సమకాలీన జీవితంలో ప్రతి రోజూ ఎవరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే.. కార్తీక పౌర్ణమినాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి.. రోజుకు ఒక వత్తి చొప్పున 365 ఒత్తల్ని జత చేసి, వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి.. కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ.. లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే.. ఈ వీడియో చూడండి.