కిమొనో... కిర్రాకు పుట్టిస్తోంది!
కిమొనో... కిర్రాకు పుట్టిస్తోంది!
కిమొనో... పేరులోనే స్టైల్ ఉంది కదూ! అది వేసుకుంటే మన స్టైల్ కూడా మారిపోతుంది. ఓ కొత్త లుక్ వచ్చేస్తుంది. ఇంతకీ కిమొనో అంటే ఏంటి? స్లీవ్స్ లో అదో రకం. కిమొనో మోడల్ చేతులు కుట్టించామంటే మామూలు డ్రెస్సు కూడా ఒక ఎక్స్ ట్రార్డినరీ డ్రెస్ లా మారిపోతుంది. కావాలంటే ఈ ఫొటోలు చూడండి.
గౌన్, షర్ట్, టీ షర్ట్, మ్యాక్సీ, నైటీ... దేనికి కిమొనో స్లీవ్స్ పెట్టినా దాని లుక్కు మారిపోవడం ఖాయం. అందుకే లూజుగా... వేళ్లాడుతున్నట్టుగా ఉండే ఈ స్లీవ్స్ ఇప్పుడు ప్రపంచమంతటా కిర్రాకు పుట్టిస్తున్నాయి. మనకి కూడా ఈ స్టయిల్ ఇప్పుడిప్పుడే బాగా దగ్గరవుతోంది.
నిజానికి ఒకప్పుడు జపనీస్ దుస్తులు మాత్రమే ఇలా ఉండేవి. చాలా లూజుగా ఉన్న స్లీవ్స్ వాళ్ల సంప్రదాయం. కానీ వాళ్ల సంప్రదాయం ఇప్పుడు ఓ పెద్ద ఫ్యాషనై కూర్చుంది. అందరూ కిమొనో స్లీవ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ స్టయిల్ కి మార్కులు పడుతుంటే మురిసిపోతున్నారు. మరి మీకొద్దా మార్కులు?!
- Sameera