రేపే కార్తీక అమావాస్య.. ఈ పనులు చేస్తే అటు పితృదేవతలు, ఇటు లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!

 


రేపే కార్తీక అమావాస్య.. ఈ పనులు చేస్తే అటు పితృదేవతలు, ఇటు లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!


హిందూ మతంలో ప్రతి తిథికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక ప్రత్యేక మాసమైన కార్తీకమాసంలో అయితే ప్రతీ తిథి చాలా పవిత్రమైనదే. మానం చివరన వచ్చే అమావాస్య తిథి మరింత ప్రత్యేకం.  కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం ద్వారా ఆ లక్ష్మీ దేవి కటాక్షం మెండుగా ఉంటుంది.  ఇంతకీ ఈ అమావాస్య రోజు చెయ్యాల్సిన పనులేంటి? అమానాస్య తిథి ఎప్పటినుండి ఎప్పటి వరకు ఉంటుంది? పూర్తీగా తెలుసుకుంటే..

అమావాస్య ఎప్పుడంటే..

హిందూ క్యాలెండర్ ప్రకారం  కార్తీకమాస అమాస్యకు ఎనలేని ప్రాధాన్యత ఉంది.  ఇది డిసెంబర్  12వ తేదీ మంగళవారం ఉదయం 06:24 నిమిషాల నుండి డిసెంబర్ 13 వ తేదీ బుధవారం 05:01 వరకు కొనసాగుతుంది.  

ఈ అమావాస్య రోజున ఉపవాసం చెయ్యడం, పితృదేవతలను సంతృప్తి పరచడం,  లక్ష్మీదేవి కటాక్షం పొందడం వంటివి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

పితృదేవతలను తృప్తి పరచడానికి..

అమావాస్య రోజు పితృకార్యాలకు చాలామంచిదని నమ్ముతారు. ఈ కార్తీక అమావాస్య రోజు  ఉదయాన్నే స్నానం చేసిన తరువాత  మరణించిన పెద్దలకు లేదా పితృదేవతలకు అర్ఘ్యం సమర్పించాలి. నీళ్లలో నిలబడి వారిని స్మరించుకుంటూ  దోసిలిలో నీరు పట్టుకోవాలి. ఇందులో నల్లనువ్వులను కూడా ఉంచాలి.  పెద్దలను స్మరించుకుంటూ ఈ నీటిని పితృదేవలతకు అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని పురాణాల నమ్మకం.

పితృదోషం పోవడానికి..

పితృదోషం పోవడానికి  అమావాస్య రోజున  త్రిపిండి శ్రాద్దం నిర్వహించవచ్తు. ఈ వ్రతాన్ని సక్రమంగా నిర్వహిస్తే మూడు తారల పూర్వీకులు తృప్తి చెందుతారు. పితృదేవతల పట్ల నిర్లక్ష్యం, పితృకార్యాలు సరిగా నిర్వహించకపోవడం,  వారికి నైవేద్యాలు  సమర్పించకపోవడం. ఇళ్లలో ఆధ్యాత్మికత లేకపోవడం వంటి కారణాల వల్ల పితృదేవతల ఆత్మలు కోపిస్తాయి. దీనివల్ల కుటుంబంలో ఇబ్బందులు, దీర్ఘకాల అనారోగ్యాలు, ఉద్యోగాలు లభించకపోవడం, వివాహాలలో ఆలస్యం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇవి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు సృష్టిస్తాయి. త్రిపిండి శ్రాద్దం నిర్వహిస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయి.

పంచబలి ఆచారం..

పంచబలి ఆచారం కూడా పితృదేవతలకోసం నిర్వహించేదే. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక అమావాస్య రోజున పంచబలి ఆచారం నిర్వహిస్తారు. కుండలో అన్నాన్ని వండుతారు. ఆ తరువాత దీన్ని ఐదు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగాన్ని కాకులకు వదిలేస్తారు.  మిగిలిన నాలుగు భాగాలను ఆవులు, కుక్క, చీమలు, దేవతలకు సమర్పిస్తారు. ఆవు భూమిని, కుక్క నీటిని, చీమ అగ్నిని, కాకి గాలిని సూచిస్తుంది. దేవతలు ఆకాశ మూలకాన్ని సూచిస్తాయి.  ఇవన్నీ చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది కుటుంబాలలో సమస్యలు తొలగుతాయి. పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదిస్తారు.

పై కార్యాలు నిర్వహించి పితృదేవతలను తృప్తి పరచడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. ఆ కుటుంబానికి  ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

                                                   *నిశ్శబ్ద.