Read more!

గీతాసారం

 

గీతాసారం


అశోచ్యానన్వ శోచాస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।।


‘అర్జునా! నువ్వు శోకింపతగనివాటి గురించి ఆలోచిస్తున్నావు. పైగా జ్ఞానిలా మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞాని అటు ప్రాణములు పోయినవాటి గురించి కానీ ఇటు ప్రాణములు పోనివాటి గురించి కానీ ఆలోచించరు కదా!’- భగవద్గీత సాంఖ్యయోగంలో కనిపించే ఈ శ్లోకంతోనే అర్జునుని విషాదానికి శ్రీకృష్ణుని సాంత్వన మొదలవుతుంది. భగవద్గీత అంతటా తాను ఏం చెప్పదల్చుకున్నాడో కూడా ఇందులో సూక్ష్మంగా వ్యక్తమవుతుంది.